రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్న విద్యాశాఖ అధికారుల దిష్టిబొమ్మ దహనం.
– ఐక్య విద్యార్థి సంఘాలు
పొలిటికల్ పవర్ పిన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేటు ప్రైవేటు విద్యాసంస్థలకు దోపిడీకి కొమ్ముకాస్తూ రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కును కించపరిచేలా వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్ (టివియువి), చేరాల వంశీ (జెవిఎస్) లు మాట్లాడుతూ విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన ఉచిత నిర్బంధ విద్యకు అనుబంధంగా ఏర్పాటుచేసిన విద్యాహక్కు చట్టం – 2009 ప్రకారం ప్రతి కార్పొరేటు మరియు ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వికలాంగ పేదలకు కేటాయించాలని చట్టం చెబుతా ఉంటే అధికారులు మాత్రం ఈ చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్నారని అన్నారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు నిబంధనలు ఉల్లంఘించి మరి అధికారులు అనుమతులు జారీ చేస్తున్నారని దాంతో ఆయా కార్పొరేట్ పాఠశాలలు ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని, విద్యను వ్యాపార వస్తువుగా మార్చి పాఠశాలలను సూపర్ బజార్ల లా చేసి తల్లిదండ్రుల వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నేరెత్తనట్టు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మేల్కొని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటూ కార్పొరేట్ తో సహా అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ మరియు విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్లను పేదలకు కేటాయించాలని ఐక్య విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి సతీష్ మాదిగ(ఎమ్ఎస్ఏఫ్), దుర్గం మనీష్, ముంజంకార్ రితిక్, రౌతు శంకర్ కుమార్, శశి, ప్రశాంత్, శేఖర్ లు పాల్గొన్నారు…

