ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఉపాధ్యాయులు జాతి నిర్మాతలు -పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి...

ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు -పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 05 2026: నపర్తి టౌన్ ఎంపీపీ పాఠశాల శ్రీనివాస్ పూర్ పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఉమ్మల రాములు అధ్వర్యములో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ హాజరయ్యారు. ముందుగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు శంభావి హెచ్‌ఎం, శ్వేత, రాజేశ్వరి లను సన్మాన గ్రహీతలుగా శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ… ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు అని అన్నారు. గురువు విద్యతో పాటు విలువలు, సంస్కారం, క్రమశిక్షణ నేర్పుతారని కొనియాడారు. ముగ్గురు ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని, పిల్లల భవిష్యత్తుకు వారే పునాది అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మల రాములు కౌన్సిలర్లు ఉభూతి మహేశ్వరి, ముదావత్ శంకరమ్మ, బాబు నాయక్ పాల్గొన్నారు. గ్రామ పెద్దలు లక్ష్మయ్య, రాములు, వినయ్, తిరుపతి, రమేష్, శాంతన్న, ఆంజనేయులు హాజరయ్యారు. తల్లిదండ్రులు, SMC సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని కౌన్సిలర్లు విభూతి మహేశ్వరి ,ముదావత్ శంకరమ్మ బాబు నాయక్ హామీ ఇచ్చారు. చివరగా విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు ముగించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!