ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper
Homeతెలంగాణఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీలో (GV) గద్దల వెంకటేశ్వర్లు కు కీలక బాధ్యతలు

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీలో (GV) గద్దల వెంకటేశ్వర్లు కు కీలక బాధ్యతలు

📰 Generate e-Paper Clip

1994 పాదయాత్ర నుంచి నేటి వరకు అలుపెరగని పోరాటం

MRPS జండా పండగ 31 సంవత్సరం సందర్భంగా గద్దల వెంకటేశ్వర్లు కేక్ తినిపియడం జరిగినది

ఉద్యమ ప్రస్థానానికి దక్కిన సముచిత గౌరవం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ ధిర మాదిగ జాతి బిడ్డ వెలుగు చుక్క జాతి కోసం నిరంతరం శ్రమించిన సేవకుడు మన గద్దల వెంకటేశ్వర్లు కు హృదయపూర్వక మైన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్న ఏబీసీడీ వర్గీకరణ కోసం నిరంతరం శ్రమిస్తూ MRPS మొట్టమొదటిసారి మండల అధ్యక్షుడిగా ప్రారంభమైన అన్నగారు ఉద్యమం ఈనాటి వరకు ఎక్కడ మచ్చ లేకుండా మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (MEF)నాయకత్వంలో కూడా పనిచేసే గద్దల వెంకటేశ్వర్లు అన్నగారి శ్రమను గుర్తించి మాదిగల ఆత్మబంధువు అన్న ని కులాల ఆశాజ్యోతి పద్మ కృష్ణ మాదిగ రాష్ట్రస్థాయి పదవి లో కీలకమైన నాయకుడిగా నియమించినందుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో, ఉద్యమ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు నిస్వార్థ సేవలందిస్తున్న సీనియర్ నాయకులు జి వి గద్దల వెంకటేశ్వర్లుకు రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీలో సముచిత స్థానం దక్కింది. దశాబ్దాలుగా ఉద్యమాన్ని, సమాజాన్ని నమ్ముకుని పనిచేస్తున్న ఆయన నిబద్ధతను గుర్తించిన మందకృష్ణ మాదిగ గారు ఈ బాధ్యతలను అప్పగించారు. ​తొలి పాదయాత్రలోనే భాగస్వామ్యం: 1994లో ఖమ్మం జిల్లాలో మందకృష్ణ మాదిగ చేపట్టిన మొట్టమొదటి చారిత్రక పాదయాత్రలోనే గద్దల వెంకటేశ్వర్లు ఉద్యమబాట పట్టారు. ఎమ్మార్పీఎస్ తొలి అడుగుల్లోనే భాగస్వామిగా మారి ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారు. ఆయన కార్యాచరణ, నాయకత్వ లక్షణాలను గుర్తించిన నాయకత్వం మొదట మధిర మండల అధ్యక్షుడిగా నియమించింది. మండలంలో ఉద్యమాన్ని పటిష్టం చేయడంతో పాటు ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేయడంతో, అనంతరం ఆయనకు మధిర నియోజకవర్గ స్థాయి బాధ్యతలు అప్పగించారు.​ 1999లో ఉద్యోగ బాధ్యతల్లో చేరినప్పటికీ, సామాజిక స్పృహను ఏనాడూ వీడలేదు. మాదిగ ఎంప్లాయ్స్ ఫెడరేషన్ (MEF) జిల్లా ఆర్గనైజేషన్ సెక్రెటరీ గా ఉద్యోగుల సమస్యలపై గళమెత్తారు. ఆ తర్వాత జిల్లా ప్రచార కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎదిగి విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

​గద్దల వెంకటేశ్వర్లు

​”1994లో మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడవడం మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకు ఎమ్మార్పీఎస్ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నాను. నాపై నమ్మకంతో రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీలో బాధ్యతలు అప్పగించిన అన్న మందకృష్ణ మాదిగ కి జీవితాంతం రుణపడి ఉంటాను. అట్టడుగు వర్గాల హక్కుల సాధన కోసం, సంస్థ బలోపేతం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తాను.”​గద్దల వెంకటేశ్వర్లుకు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు దక్కడం పట్ల స్థానిక ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!