ePaper
Monday, September 14, 2026
📄 ePaper

ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి.. దాసరి మధు మోహన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

గంగారం ప్రకాష్‌నగర్ కాలనీలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ 

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచన

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్ 9 తెలుగు న్యూస్ , సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఎ హరిబాబు జూన్ 27 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామ అభివృద్ధి ప్రదాత, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దాసరి మధు మోహన్ రెడ్డి ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) కార్యక్రమంపై అప్రమత్తంగా ఉండాలని గ్రామ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. శనివారం (27-06-2026) గంగారం గ్రామంలోని ప్రకాష్‌నగర్ కాలనీలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ సర్పంచ్ కాకర్ల రేవతి, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎస్‌ఐఆర్ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అలాగే, ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా పూరించాలో గ్రామ ప్రజలకు వివరించి, ప్రతి అర్హత కలిగిన ఓటరు తన వివరాలను సక్రమంగా నమోదు చేసుకునేలా సహకరించాలని కోరారు.

Latest Articles

విద్యార్థులు వినాయకుని నుండి ఏకాగ్రత, పట్టుదల నేర్చుకోవాలి -పలుస శంకర్ గౌడ్

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ప్రజా సేవలో 42 వసంతాలు పూర్తి చేసుకున్న రాయప్ప

42 సంవత్సరాల నిస్వార్థ ప్రజా సేవ పూర్తి చేసుకున్న ఎస్సై కొప్పుల...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!