ఆర్డీవో, డిఎస్పీల తో ప్రశాంత వాతావరణ
మధ్యాహ్నం నుంచి ఊపు అందుకున్న నామినేషన్లు.
కలసపాడు అక్టోబర్ 21 పొలిటికల్ పవర్ పిన్ 9టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్. ఏం. ప్రసాదరావు. కలసపాడు వైయస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల పర్వం ఉద్రిక్త వాతావరణం లో జరిగింది. మొదటగా నామినేషన్ వేను వచ్చిన వైసిపి కార్యకర్తలను తాసిల్దార్ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. తదనంతరం ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరగడంతో స్థానిక ఎస్సై హుటాహుటిన ఆ స్థలానికి వెళ్లి ఇరు వర్గాల వారికి చట్ట ప్రకారం తెలియజేశారు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియడంతో ఆర్డిఓ మరియు డీఎస్పీ రాకతో ప్రశాంత వాతావరణం చోటుచేసుకునింది. అనంతరం మండలంలో మధ్యాహ్నం 1: 45 నిమిషాలకు మొదటి నామినేషన్ వేయడం జరిగిందని రిటర్నింగ్ ఆఫీసర్ ఎం. రమేష్ కుమార్ తెలిపారు. మండలంలో ప్రశాంతమైన వాతావరణంలో పోలీసు బందోబస్తు 9 ఎంపీటీసీ స్థానాలకు గాను ఆరు స్థానాలకు ఎనిమిది నామినేషన్లు దాఖలు చేశారు. దాఖలు చేసిన అభ్యర్థులు నెల 24వ తేదీన జరిగే నామినేషన్ల పరిశీలన సమయంలో హాజరుకావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలసపాడు మండల ఎస్సై హనుమంత్, మండల ప్రజా పరిషత్ అధికారి మహబూబ్ బి, తాసిల్దార్, రవీంద్రారెడ్డి ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


