పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 04 2026: వనపర్తి మండలం చినగుంటపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంజనేయులు, బాలస్వామి, సాయిలు, శంకర్, నాగరాజు, రాజేష్, వెంకటేష్, కరుణాకర్, బాలరాజు, చిన్న ఆంజనేయులు తదితరులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. వీరికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ… గత 10 నుంచి 12 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ తమను కేవలం అవసరాలకే ఉపయోగించుకున్నారని, తమకు ఎలాంటి గుర్తింపు గానీ న్యాయం గానీ జరగలేదని వాపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, ప్రజా పాలన చూసి ఆకర్షితులై ఇకపై కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని నిర్ణయించుకుని పార్టీలో చేరినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి తారతమ్యాలు ఉండవని, ప్రతి కార్యకర్తకు సమాన గౌరవం ఉంటుందని అన్నారు. పార్టీ బలోపేతానికి యువత కీలక శక్తిగా నిలవాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మండల అధ్యక్షులు రవి కిరణ్, వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, సర్పంచ్ వాల్యానాయక్, కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, నాయకులు ఎత్తం రవి, జనార్దన్ పాపిరెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
