పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9టీవీ సమగ్ర జాతీయ దినపత్రిక జులై 04 2026 రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు కలసపాడు కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన సైనికుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం గత ఆరు రోజులుగా విజయవంతంగా కొనసాగుతుంది. ఆయన ఆదేశాల మేరకు, కడప పార్లమెంట్ పరిశీలకులు చిలకం, మధుసుధన్ రెడ్డి నేతృత్వంలో 28 మంది సభ్యుల బృందంకలసి 6 వ రోజు కడపలోని హరిత హోటల్లో కడప పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల పార్టీ కడప పార్టీ నాయకుడు పండ్రా రంజిత్ కుమార్ మరియు నాయకులు, జనసైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 12 సంవత్సరాలపాటు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి కమిటీల్లో బాధ్యతలు చేపట్టి అవకాశం పవన్ కళ్యాణ్ కల్పించబోతున్నారు. పార్టీ బలోపేతానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన నాయకులు, జనసైనికులు, వీర మహిళల ప్రతి ఒక్కరూ నుంచి దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ దరఖాస్తులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ… జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ఐక్యతతో ముందుకు సాగి జనసేనను మరింత బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కడప పార్లమెంట్ జనసేన నిర్మాణ సమాచార సేకరణ కమిటీ సభ్యులు తాతంశెట్టి తులసి నాగేంద్ర, సురేష్ బాబు మురళీకృష్ణ డా” నాగార్జున, గోగు లక్ష్మీ భరత్, గజ్జల సాయి ప్రసన్న, ఏ రామారావు, నందకిషోర్, రాము, రవిశంకర్, చలపతి, జగదీష్, సిహెచ్ నాగమల్లయ్య, సిద్ధాంత్, జి విజయ్, రామ్ సిద్దు, కిరణ్ కుమార్, తోట బాలచంద్రుడు, మాదాసు మురళి, పాల్గొన్నారు
