ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తికాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం కోసం పనిచేయలేదు 

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం కోసం పనిచేయలేదు 

📰 Generate e-Paper Clip

దేశ స్వాతంత్ర ఉద్యమంలో బిజెపి నాయకుల పాత్ర శూన్యం 

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు 

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 09 2026: పట్టణ కేంద్రం ఆర్జీ గార్డెన్ లో బి ఎల్ ఏ ల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త కాపు శివసేన రెడ్డి, టిపిసిసి బి ఎల్ ఏ వనపర్తి ఇన్చార్జ్ చత్రు రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తూడి మెగా రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… భారతదేశాన్ని 300 సంవత్సరాలు మొగలు చక్రవర్తులు పరిపాలించగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే వాళ్లు బ్రిటిష్ వారి బానిస సంకెళ్లను తెంచటానికి కాంగ్రెస్ పార్టీ 1885 లో ఆవిర్భవించింది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం కోసం ఆవిర్భవించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారిపై చేసిన పోరాటాల వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు 1952 జరిగాయి అప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా కమ్యూనిస్టులు తప్ప వేరే పార్టీ లేనేలేదు అని అన్నారు.స్వాతంత్ర ఉద్యమంలో బిజెపి నాయకుల పాత్ర శూన్యం అని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రు, వైయస్ రాజశేఖర్ రెడ్డి లపై కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉండేది కానీ ఇప్పుడు కాస్త తగ్గింది దానిని కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచితనంతో ఓట్ బ్యాంక్ పెంచుకోవాలని అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బిజెపి పార్టీ ఆ రాష్ట్రంలో 90 లక్షల ఓట్లను తొలగించారు .మమతా బెనర్జీ పోరాటం వల్ల 30 లక్షల ఓట్లను చేర్చారు. మమతా బెనర్జీ 60 లక్షల ఓట్ల తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఓటు చాలా కీలకం కాబట్టి బిఎల్ఎలు ప్రతి ఓటును గమనించి పనిచేయాలని సూచించారు. రాహుల్ గాంధీ దేశంలో ప్రతి వర్గాన్ని కలుస్తూ వారి సమస్యలను వింటూ పనిచేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని అన్నారు. నూతనంగా ఎన్నుకున్న వనపర్తి టౌన్ అధ్యక్షుడు కదిరే రాములు యాదవ్, పెబ్బేర్ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, గోపాల్ పేట్ మండల అధ్యక్షులు నరహరి, వనపర్తి మండల అధ్యక్షులు రవి కిరణ్, పెబ్బేర్ మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, పెద్దమందడి మండల అధ్యక్షులు వెంకటస్వామి, ఏదుల మండల అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి, శ్రీరంగాపూర్ మండల అధ్యక్షులు విష్ణు ముదిరాజ్, రేవల్లి మండల అధ్యక్షులు సుల్తాన్, ఖిల్లా గణపురం మండల అధ్యక్షులు కృష్ణయ్య లను శాలువలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ బిఎల్ఎలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!