ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిడిగ్రీ విద్యార్థులకు సువర్ణావకాశం – గురుకుల డిగ్రీ కళాశాలలో ఉచిత ప్రవేశాలు ప్రారంభం

డిగ్రీ విద్యార్థులకు సువర్ణావకాశం – గురుకుల డిగ్రీ కళాశాలలో ఉచిత ప్రవేశాలు ప్రారంభం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 09 2026: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (బాలురకు), చౌదర్‌పల్లి గ్రామం, దేవరకద్ర మండలంలో 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలను ప్రారంభించింది. పాలమూరు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న ఈ కళాశాల ఎస్‌వీఐటీఎస్ ఇంజినీరింగ్ కళాశాల దగ్గరలో గల ప్రక్కన బిల్డింగ్ లో కొనసాగుతోంది. కళాశాలలో ఇంగ్లీష్ మాధ్యమంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీఏలో HEP, HES, EPH, బీకాంలో కంప్యూటర్ అప్లికేషన్స్ (CA), బీఎస్సీలో BZC, BBtC, MPC, MPCs, MSCs, MSDs గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, డిజిటల్ తరగతి గదులు, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, క్రీడా సౌకర్యాలు, జిమ్నాసియం, పీజీ ప్రవేశ పరీక్షల కోచింగ్, జాతీయ స్థాయి సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి ప్రత్యేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్య, ఉచిత భోజనం మరియు వసతి, మూడు జతల యూనిఫారాలు, 24 గంటల వైద్య సదుపాయం, నెలకు రూ.200 పాకెట్ మనీ, సంవత్సరానికి సుమారు రూ.2,100 కాస్మెటిక్ చార్జీలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి కోర్సులో కేవలం 40 సీట్లు మాత్రమే ఉండగా, ప్రవేశ పరీక్ష లేకుండానే ప్రత్యక్ష ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు, తల్లిదండ్రులు మరిన్ని వివరాల కోసం దేవరకద్ర – 9014040834, నాగర్‌కర్నూల్ – 8977331008, నారాయణపేట – 9553288934 నంబర్లను సంప్రదించాలని రీజినల్ కో-ఆర్డినేటర్ వి. శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!