
బిక్కవోలు:కాపవరం ఉన్నత పాఠశాలకు 15వేల రూపాయలు విలువ చేసే ఐదు ఉపాధ్యాయటేబుల్ లను
కొట్టు వీరవెంకట సత్యనారాయణ మూర్తి (సత్తిబాబు),
కొట్టు చక్ర రావు, సత్యం శెట్టి మణికంఠ, చాపల వెంకన్న గార్లు లు బహుకరించుట జరిగింది.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు పి గోపాలకృష్ణారావు మాట్లాడుతూ తరగతి గదిలో ఉపాధ్యాయులకు టేబుల్ లు లేక ఉపాధ్యాయులు పడుతున్న అవస్థను గమనించిన పెద్దలు వెంటనే తయారు చేయించి ఐదు బల్లలను అందజేశారనీ పాఠశాల అభ్యున్నతికి మీ వంటి వారి సహాయ సహకారాలు నిరంతరం మాకు ఉండాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.వీరరాఘవరెడ్డి, టి.వి.సత్యనారాయణరెడ్డి
వై.బి.యస్.ఆచార్యులు, యస్.రవికుమార్, సి.హెచ్ కోమలి, కె.రవిభాస్కర రెడ్డి, డి.లోవకుమారి, సి.హెచ్.చైతన్య రెడ్డి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
