పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 31 2026: హైదరాబాద్ జూలై 31 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ కే. సరిత తిరుపతయ్య యాదవ్ ను హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో ఉన్న ఫెడరేషన్ కార్యాలయంలో కొత్తకోట మండల నాయకులు శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. దేవరకద్ర ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి వీరాభిమాని గొల్లదొడ్ల జంపన్న యాదవ్ కు ప్రభుత్వం తరఫున గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ సందర్భంగా కొత్తకోట మండల మాజీ వైస్ ఎంపీపీ వాకిటి బాలరాజ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరుకుల యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు కుడికిల్ల నాగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
