ePaper
Saturday, November 7, 2026
📄 ePaper

జూలూరుపాడులో ఘనంగా గ్రామ పెద్దల ఆత్మీయ సమ్మేళనం. సామాజిక సమరసతతోనే జాతీయ సమైక్యతకు బలమైన పునాది: అప్పాల ప్రసాద్ జీ.

📰 Generate e-Paper Clip

జూలూరుపాడు: నవంబర్ 07: పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిన్9 తెలుగు న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల కేంద్రంలో. సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో. మండలంలోని వివిధ గ్రామాల గ్రామ పెద్దల ఆత్మీయ సమ్మేళనం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ హాజరై మార్గదర్శనం చేశారు.

13 గ్రామాల నుంచి వివిధ కుల సంఘాలకు చెందిన పెద్దలు, ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో గ్రామాల్లో అంటరానితనం, వివక్షత పూర్తిగా తొలగినప్పుడే జాతీయ సమైక్యతకు బలమైన పునాది పడుతుందని అప్పాల ప్రసాద్ జీ అన్నారు.

గ్రామాల్లోని అన్ని సామాజిక వర్గాల పెద్దలు పరస్పరం కలిసి కూర్చొని, దేవాలయ ప్రవేశం, పండుగలు, సామాజిక కార్యక్రమాలను ఎలాంటి హింస, ద్వేషాలకు తావులేకుండా ఐక్యంగా నిర్వహించాలని సూచించారు. వివిధ కుల సంఘాల పెద్దలు తమ తమ సామాజిక వర్గాల అభివృద్ధికి కృషి చేస్తూనే, ఇతర సామాజిక వర్గాలతో స్నేహభావంతో కలిసి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్న తీరు అభినందనీయమన్నారు.

అన్ని సామాజిక వర్గాలు పరస్పర స్నేహభావంతో కలిసి పనిచేయడం జాతీయ సమైక్యతకు ప్రతిబింబమని పేర్కొన్నారు. ఉమ్మడి కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, తమ అనుభవాలను వివరించారు.

అప్పాల ప్రసాద్ జీ మాట్లాడుతూ “ఒకే దేశం – ఒకే ప్రజ” అనే భావనతో జాతీయ స్థాయిలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల మధ్య పరస్పర గౌరవం, సోదరభావం, సహకారం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

భారతదేశ సామాజిక చరిత్రను ప్రస్తావిస్తూ, బ్రిటిష్ పాలనలో “విభజించి పాలించు” విధానం ద్వారా భారత సమాజంలోని విభజనలను మరింత పెంచే ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. నేటి యువత కుల వివక్షకు తావులేకుండా స్నేహభావంతో ముందుకు సాగుతూ సమాజంలో ఐక్యతను పెంపొందించడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా పాల్గొన్న వివిధ కుల సంఘాల పెద్దలను అప్పాల ప్రసాద్ జీ శాలువాలతో సన్మానించి. అభినందించారు

ఈ కార్యక్రమంలో సంచార యాత్ర రాష్ట్ర అధ్యక్షులు స్వర్ణ కుమార్, సామాజిక సమరసత వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి, సోడె శ్రీరాములు, చిలుకూరి రమేష్, రోకటి రంగారావు, గుండెపిన్ని వెంకటేశ్వర్లు, మద్దిబోయిన నాగరాజు, రామిశెట్టి నాగేశ్వరరావు, బుడుగు వీరస్వామి, భూక్య రమేష్, తెల్లం నరసింహారావు, ఇర్పా రామారావు, కాలం నరసింహారావు, మడి రవి, తదితరులు, వివిధ కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.

Latest Articles

బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలు పరిష్కరించాలి

–పెంచినప్రివిలేజ్,పన్నునువెంటనేరద్దుచేయాలి,ఎక్సైజ్ కమిషనర్ తీరుతో ప్రభుత్వం అప్రతిష్టపాలు,ప్రివిలేజ్ పెంపుతో లక్షల మందికి ఉపాధి...

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యుగంధర్ రెడ్డికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శ

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు.. బాధితుడికి అండగా నిలిచిన మాజీ...

పేదోడి గుడిసెలో వెలుగు నింపిన కౌన్సిలర్ జె. అఖిల ప్రియా తండ్రి జె. సుభాష్

 – గత పది సంవత్సరాల క్రితం మాజీ కౌన్సిలర్ జె. సుభాష్ ...

Related Articles

గిరిజన పోరాటానికి దక్కిన విజయం…! ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు.. సేవాలాల్ సేన పోరాట ఫలితం గిరిజన పోరాటానికి దక్కిన విజయం..

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి: ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు.. సేవాలాల్ సేన పోరాటమే ఫలితం..గిరిజనుల దశాబ్దాల కల సాకారంప్రభుత్వానికి కృతజ్ఞతలు...

కమ్యూనిస్టు విప్లవోద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ విప్లవ జోహార్లుముత్యాలంపాడు గ్రామంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ సభ 

     అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ 9 టీవీ న్యూస్ ( ఆర్సి కారంవెంకటేష్) నవంబర్ 07: ములకలపల్లి మండలం లో సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా...

మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి: పేదల ఇళ్లలో వెలుగుల పండుగ చేద్దాం నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన తుంబూరు దయాకర్ రెడ్డి

పొలిటికల్ పవర్ (ప్రత్యేక ప్రతినిధి):రాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారమైన శుభవేళ, ఈ దీపావళి పండుగను ఇందిరమ్మ ఇండ్లలో లబ్ధిదారులతో కలిసి అత్యంత వైభవంగా జరుపుకోనున్నట్లు మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్...
error: Content is protected !!