ePaper
Saturday, November 7, 2026
📄 ePaper

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యుగంధర్ రెడ్డికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శ

📰 Generate e-Paper Clip

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు.. బాధితుడికి అండగా నిలిచిన మాజీ మంత్రి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 07 2026: పెద్దమందడి / అడ్డాకుల మండలం పెద్దమునగల్ చెడు గ్రామానికి చెందిన యుగంధర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కొత్తకోటకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెల్టూరు స్టేజ్ సమీపంలో గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంటనే స్పందించి బాధితుడికి అండగా నిలిచారు. తొలుత యుగంధర్ రెడ్డిని వనపర్తిలోని హైందవ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం అవసరమని భావించి హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా స్వయంగా దగ్గరుండి హైదరాబాద్‌కు పంపించారు. ఆపద సమయంలో స్పందించి బాధితుడికి వైద్య సహాయం అందించడంపై స్థానికులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజ ప్రకాష్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సయ్యద్ జమీల్, ఫజల్ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలు పరిష్కరించాలి

–పెంచినప్రివిలేజ్,పన్నునువెంటనేరద్దుచేయాలి,ఎక్సైజ్ కమిషనర్ తీరుతో ప్రభుత్వం అప్రతిష్టపాలు,ప్రివిలేజ్ పెంపుతో లక్షల మందికి ఉపాధి...

పేదోడి గుడిసెలో వెలుగు నింపిన కౌన్సిలర్ జె. అఖిల ప్రియా తండ్రి జె. సుభాష్

 – గత పది సంవత్సరాల క్రితం మాజీ కౌన్సిలర్ జె. సుభాష్ ...

Related Articles

పేదోడి గుడిసెలో వెలుగు నింపిన కౌన్సిలర్ జె. అఖిల ప్రియా తండ్రి జె. సుభాష్

 – గత పది సంవత్సరాల క్రితం మాజీ కౌన్సిలర్ జె. సుభాష్  ఆధ్వర్యంలో స్తంభాలు నేడు కూతురు కౌన్సిలర్ జె. అఖిల ఆధ్వర్యంలో నూతనంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

కవయిత్రి మొల్ల విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు.. 11న భూమిపూజ

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా భూమిపూజకు సన్నాహాలు కుమ్మర కుల బంధువులంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలి: సంఘం నాయకుల పిలుపు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

మట్టి ప్రమిదలు వెలిగిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం

చీకటిని పారద్రోలి వెలుగులను పంచే పండుగే దీపావళి -పలుస శంకర్ గౌడ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 07 2026:...
error: Content is protected !!