పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 30 2026: వనపర్తి పట్టణానికి చెందిన ఇద్దరు పిల్లలు తప్పిపోవడంతో సమాచారం అందుకున్న వనపర్తి టౌన్ పోలీస్ సిబ్బంది తప్పిపోయిన పిల్లలను
క్షేమంగా వారి తల్లి దగ్గరకు చేర్చడంతో పోలీస్ సేవలను పట్టణ ప్రజలు అభినందనలు తెలియజేశారు. బస్సు దిగిన తల్లి వనపర్తి కొత్త బస్టాండ్ లో వాటర్ కోసం వెళ్లగా పిల్లలు వేరే దారిలో వెళ్లడంతో తప్పిపోయారు. పిల్లలను వెతుక్కుంటూ తల్లి ఎండి మోమిన్, మరో దారిలో వెళ్ళింది. పిల్లలు తిరిగి బస్టాండ్ కు చేరుకుని ఏడుస్తుండగా అక్కడ ఉన్న ప్రయాణికులు పట్టణ
పోలీస్ కు సమాచారం అందించారు. అక్కడ చేరుకున్న టౌన్ పోలీస్ కానిస్టేబుల్ వినోద్. విచారణ చేపట్టి తల్లి ఎండి మోమిన్, తండ్రి వాజిత్ కు అప్పగించడం జరిగిందని తెలిపారు.
