పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి కొణిజర్ల, జూన్ 13: ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో పగిడేరు వాగుపై నిర్మాణంలో ఉన్న లో-లెవెల్ బ్రిడ్జి పనులను కాంగ్రెస్ నాయకులు అకారణంగా అడ్డుకోవడం దుర్మార్గమని ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాత మధుసూదన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఉదయం స్థానిక సర్పంచ్, మండల పార్టీ నాయకులు మరియు రైతులతో కలిసి ఆయన బ్రిడ్జి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు, రైతులు తమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్సీకి వివరించారు.
అధికారులను రానీయకుండా బెదిరింపులు:
రూ. 75 లక్షల పాలనాపరమైన అంచనా వ్యయంతో ఈ బ్రిడ్జి పనులు మంజూరయ్యాయని, అధికారులు వచ్చి మార్కింగ్ ఇచ్చి పనులు ప్రారంభించినట్లు రైతులు తెలిపారు. అయితే, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావాలనే అధికారులను బెదిరిస్తున్నారని, “బ్రిడ్జి పనులు చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తాం, బదిలీలు చేయిస్తాం” అని హెచ్చరించడం వల్లే అధికారులు ఇటువైపు రావడం లేదని రైతులు ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు. పనులు నిలిచిపోవడం వల్ల ఈ వ్యవసాయ సీజన్‌లో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల సమస్యలపై ఎమ్మెల్సీ తాత మధుసూదన్ స్పందిస్తూ.. అధికార పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధికి సహకరించాలి తప్ప ఇలా అడ్డుకోవడం తగదని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ‘దోచుకోవడం, దాచుకోవడం’ తప్ప సాధించిందేమీ లేదని విమర్శించారు. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని, ఇచ్చిన హామీలను ఏమాత్రం అమలు చేయలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సోయి తెచ్చుకోవాలని, అభివృద్ధిని అడ్డుకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెడతారని హెచ్చరించారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులందరికీ ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. యూరియాను ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా కాకుండా, నేరుగా షాపుల ద్వారానే పంపిణీ చేయాలన్నారు. రైతు పాస్‌బుక్కులతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు సరిపడా యూరియా కట్టలను అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాత మధుసూదన్ వెంట: స్థానిక సర్పంచ్ దేరంగుల వెంకటరమణ, వైరా నియోజకవర్గం నాయకులు లకావత్ గిరిబాబు,
ఖమ్మం జిల్లా నాయకులు పోట్ల శ్రీనివాసరావు, దేరంగుల బ్రహ్మం, బోడపోతుల బాబు, దొడ్డపనేని రామారావు, కిలారు మాధవరావు. సర్పంచ్ పోగుల శ్రీను, పసంగులపాటి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ సొందు, ఉప సర్పంచ్ కృష్ణ, దావ విజయకుమార్, అనుముల శ్రీను, వడ్లకుంట సతీష్, ఎస్కే ఖాదర్ బాబు, జట్ల శ్రీను, కాశిమల్ల సతీష్, ఎర్ర కృష్ణయ్య, ఇజ్జగాని రామారావు, బత్తుల వెంకన్న. కొణిజర్ల మండల సోషల్ మీడియా కన్వీనర్ కొత్తపల్లి వినయ్ మరియు తుమ్మలపల్లి గ్రామ ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


