క్రీడలతో ప్రపంచ గుర్తింపు పొందవచ్చు ఎమ్మెల్యే
పొలిటికల్ పవర్ తెలుగు రహినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో జూన్ 24 2026: సానే వినోద్ కుమార్ రెడ్డి దేశానికే గర్వకారణం ఇటీవల బ్యాంకాక్ లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో క్రీడా పోటీల్లో వనపర్తి జిల్లాకు చెందిన సానె వినోద్ కుమార్ రెడ్డి 2 బంగారు పథకాలు, 1 కాస్యం పథకం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచారని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మండలం మాజీ ఎంపీపీ సానే కిచ్చారెడ్డి కుమారుడు సానే వినోద్ కుమార్ రెడ్డి ఈ పథకాలు సాధించడం ద్వారా దేశానికే కాక వనపర్తి జిల్లా, మండలం గ్రామానికి సైతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు. విద్యార్థులు, యువకులు ఉన్నత చదువులతో పాటు క్రీడలపై దృష్టిసారిస్తే ఉన్నత స్థాయి గుర్తింపును పొందవచ్చునని ఆయన సూచించారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాదులోని మాదాపూర్ లో గల తన కార్యాలయంలో ఎమ్మెల్యే క్రీడాకారుడు సానే వినోద్ కుమార్ రెడ్డిని శాలువాలతో సత్కరించి అభినందించారు.

