ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంబీఏఎస్ విద్యార్థుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు తల్లిదండ్రుల వినతి

బీఏఎస్ విద్యార్థుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు తల్లిదండ్రుల వినతి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా జిల్లా బ్యూరో జూన్ 24 2026: ఖమ్మం: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బీఏఎస్) పథకం కింద విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా బీఏఎస్ విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా బీఏఎస్ పథకం కింద చదువుతున్న విద్యార్థులు ప్రతి విద్యా సంవత్సరంలో ఒకే విధమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి పాఠశాలలకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలు, నిధుల విడుదలలో జాప్యం కారణంగా విద్యార్థుల చదువుకు అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని సెంచరీ హై ప్రొఫైల్ స్కూల్‌లో సుమారు 450 మంది, బేబీ మూన్ హై స్కూల్‌లో సుమారు 1000 మంది, సెయింట్ జోసెఫ్ హై స్కూల్‌లో సుమారు 40 మంది బీఏఎస్ విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపారు. డే స్కాలర్ విద్యార్థులకు అనుమతి ఉన్నప్పటికీ హాస్టల్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యా సామగ్రి కోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని, పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు అందడం లేదనే ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి పునరావృతమవుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. పేద కుటుంబాలకు పిల్లల విద్యే అత్యంత విలువైన ఆస్తి అని, ప్రభుత్వానికి మరియు పాఠశాల యాజమాన్యాలకు మధ్య ఉన్న ఆర్థిక అంశాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదని కోరారు. పెండింగ్ బిల్లులు ఆలస్యమైనా పిల్లల భవిష్యత్తు ఆలస్యం కాకూడదని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఏఎస్ పథకానికి సంబంధించిన పెండింగ్ ఫీజు బకాయిలు పూర్తిగా చెల్లించకపోవడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల విద్య విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. బీఏఎస్ పథకంపై రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, హాస్టల్ మరియు డే స్కాలర్ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలని, పాఠ్యపుస్తకాలు, విద్యా సామగ్రి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రతి సంవత్సరం ఇదే సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!