ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 వేలు పెన్షన్ అమలు జేయాలి.
రాష్ట్ర వికలాంగుల పార్టీ అధ్యక్షుడు ఇస్సాకు అలీ
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఖమ్మం సెప్టెంబర్ 02 2026: గత నాలుగు సంవత్సరాల నుండి దివ్యాంగులు పెన్షన్ కోసం వేచి ఉన్నారని ఇప్పుడు కేవలం 15 రోజుల గడువు ఇవ్వడం సమంజసం కాదని రాష్ట్రీయ వికలాంగ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇసాక్ అలీ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ల కోసం ఆ దరఖాస్తు గడువును మరో నెల పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చాలా మంది దివ్యాంగులు అనేక కారణాలతో దరఖాస్తులు చేయలేకపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం సెప్టెంబర్ 30 వరకు గడువు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 వేల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన పెన్షన్ సెప్టెంబర్ నెల నుంచే అమలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.

