ePaper
Sunday, November 15, 2026
📄 ePaper

నేటి బాలలే రేపటి పౌరులు… ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!

📰 Generate e-Paper Clip

కలసపాడు, నవంబర్ 14 (పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ – సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక):

ఎం. ప్రసాదరావు, వైఎస్ఆర్ కడప జిల్లా రిపోర్టర్, పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ.

బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండల కేంద్రంలోని స్థానిక సెయింట్ ఆంటోనిస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ చిత్తా బాల్ రెడ్డి, జయమ్మ, మరియు కరస్పాండెంట్ చిత్తా రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా భారతదేశ మొదటి ప్రధాన మంత్రి, జాతి నిర్మాణంలో తనదైన ముద్ర వేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “నేటి బాలలే రేపటి పౌరులు” అన్న చాచా నెహ్రూ ఆశయాలను విద్యార్థులకు మరోసారి గుర్తుచేశారు. పిల్లలంటే నెహ్రూకు ఉన్నఅపారమైన ప్రేమను కొనియాడుతూ, ఆయన జన్మదినాన్ని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. పిల్లలు ఉన్నత చదువులు చదివి, కష్టపడి ప్రయోజకులు కావాలనే సమున్నత లక్ష్యంతోనే నెహ్రూ అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్స్‌ను ఏర్పాటు చేసి విద్యారంగానికి పెద్దపీట వేశారని కొనియాడారు.

అనంతరం మదర్ టెరిసా గారి అడుగుజాడలను స్మరిస్తూ.. “శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది” అనే గొప్ప సూక్తిని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో చురుగ్గా పాల్గొని, తమలోని సృజనాత్మకతను వెలికితీసి భావి భారత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో భాగంగా వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ఘనంగా బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ చిత్తా ప్రభావతి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Latest Articles

ఆత్మీయంగా సాగిన నిశ్చితార్థ వేడుక..నూతన జంటకు సోయం వీరభద్రం ఆశీస్సులు

 పొలిటికల్ పవర్,దమ్మపేట,నవంబర్ 14: దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామానికి చెందిన కూకలకుంట...

కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఫలించిన మంత్రి తుమ్మల కృషి

ఆరు ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసిన ఎయిర్పోర్ట్...

ప్రజా పాలన ప్రభుత్వంలో మంజూరైన కొత్త పింఛన్లు

పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9...

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పట్టించుకోని ప్రభుత్వం

పొలిటికల్ పవర్ న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్...

మంచి నీటి ఏద్దడి నివారణకు ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి..

సిపిఎం పినిరెడ్డిగూడెం గ్రామ శాఖ కమిటీ డిమాండ్... పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

Related Articles

వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్.జగన్ కుటుంబ సభ్యులపై అసభ్యకరతమైన వ్యాఖ్యలు చేసిన జనసేన మూక అరాచకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళిగిరి డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వైయస్సార్సీపీ నేతలు. 

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*ట్విట్టర్ స్పేస్ లో జనసేన మూక చేసిన...

శ్రీ అంకాళమ్మవారికి వైభవంగా విశేష పూజలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నంద్యాల జిల్లా నవంబర్ 14 2026: నంద్యాల జిల్లా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలం క్షేత్ర గ్రామదేవత శ్రీ...

ఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర… శత్రుచర్ల విజయరామరాజు! ఒక రాజకీయ ప్రస్థానం.. ఎన్నో పదవులు.. ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం!

పొలిటికల్ పవర్   విజయనగరంఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, కొన్ని వ్యక్తిత్వాలు కేవలం రాజకీయ నాయకులుగానే కాకుండా ఒక ప్రత్యేక రాజకీయ అధ్యాయంగా నిలిచిపోతాయి. అలాంటి నాయకుల్లో శత్రుచర్ల విజయరామరాజు ఒకరు. దశాబ్దాల పాటు...
error: Content is protected !!