*పదో తరగతి ఫలితాల్లో మేడిపల్లి శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం*
జి.అభిషేక్ ప్రథమ స్థానం (590), ద్వితీయ స్థానం ప్రణమ్య, పి సాయి, శ్రీ హంసిని,ఎస్.సాయి శ్రీ, జి. వైష్ణవి (585).
మేడిపల్లి: 01 మే (పొలిటికల్ పవర్ న్యూస్)ఉపేందర్ కూరెళ్ళ
మేడిపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో ఈ ఏడాది కూడా విద్యార్థుల ప్రభంజనం కొనసాగింది.
మేడిపల్లి శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభకు మరోసారి అద్దం పడుతున్నది. ఇందులో భాగంగా
జి.అభిషేక్(590) మార్కులతో పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచాడు. ద్వితీయ స్థానంలో , కే. ప్రణమ్య, పి.సాయి శ్రీ హంసిని , ఎస్.సాయి శ్రీ , జీ.వైష్ణవి (585) తృతీయ స్థానంలో
ఎ.సిరి చందన, జి.గగన్ కుమార్, జీ.తనుష్ (584) మార్కులు సాధించారు.
వీటితోపాటు 550 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 62, 500 కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 101 మరియు మొత్తం 132 మంది విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. మేడిపల్లి శాఖ యావరేజ్ 533 మార్కులతో ప్రతిభ చాటారు.
ఈ సందర్భంగా నారాయణగూడ జోన్ ఏజీఎం మొఘల్ నూర్ మహమ్మద్ అలీ,ఆర్ఐ బండి వెంకట్, అకాడమిక్ కో.ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్ మరియు పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు సాధించిన విజయాలు భవిష్యత్తులో బలమైన పునాది అవుతాయని ఇలాగే మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయంపై వారి తల్లిదండ్రులు ఆనంద వ్యక్తం చేస్తూ పాఠశాల ఉపాధ్యాయులు అందిస్తున్న నాణ్యమైన విద్యకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద మేడిపల్లి శ్రీ చైతన్య పాఠశాల మరోసారి తన ప్రతిభను చాటుతూ విద్యారంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
