ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

5మీడియా అక్రెడిటేషన్ కమిటీలో…  *టీడబ్ల్యూజేఎఫ్ కు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం*

📰 Generate e-Paper Clip

5మీడియా అక్రెడిటేషన్ కమిటీలో…

*టీడబ్ల్యూజేఎఫ్ కు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం*

*-కోర్టు దిక్కరణగా పరిగణించాల్సివస్తుందని వ్యాఖ్య*

 

మే 1

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్

హైదరాబాద్,మహానది న్యూస్, మే 01: మీడియా అక్రెడిటేషన్ కమిటీ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్

(టీడబ్ల్యూజేఎఫ్) యూనియన్ కు ప్రాతినిధ్యం కల్పించక

పోవడంపై ఆ సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య

హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సింగిల్ బెంచి విచారణ జరిపింది. ఈ విచారణ సందర్బంగా ప్రభుత్వ న్యాయవాదుల వాదనలు, పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న తర్వాత సింగిల్ బెంచి న్యాయమూర్తి జస్టీస్

రేణుక యార తీవ్రంగా స్పందించి ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో పిటిషనర్ మామిడి సోమయ్య ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమీషనర్ కు దాఖలు చేసుకున్న దరఖాస్తును అమలు చేయకపోడం, ప్రభుత్వ న్యాయవాదులు కౌంటర్ ఫైల్ చేయకపోడం పట్ల న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 20న పిటిషనర్ సమర్పించిన రీప్రజెంటేషన్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నారో, తీసుకున్న చర్యల పై ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ఎటువంటి నివేదిక సమర్పించారో తెలియజేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ వ్యాజ్యన్ని తదుపరి విచారణకు వాయిదా వేశారు. అదేవిధంగా

మార్చి 26న కోర్టు

జారీ చేసిన ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేసి నివేదిక(compliance report)ను కోర్టుకు సమర్పించాలని జస్టీస్ రేణుక యారా ప్రతివాదులను ఆదేశించడం జరిగింది.

కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని ప్రభుత్వ న్యాయవాదులను వ్యాఖ్యానిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Latest Articles

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

టివి 9 లో లోకేష్ పాగా

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధువంతం గా ఎదుర్కొంటాం

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం*పొలిటికల్ పవర్...

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ డప్పు ధర్నా

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ఆరోపణపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

Related Articles

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 12 2026: పెద్దమందడి 18 సంవత్సరా లు...

టివి 9 లో లోకేష్ పాగా

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*దేశంలోని శాటిలైట్‌ టీవీ ఛానళ్లలో టీవీ9 అగ్రస్థానంలో వుంది....

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధువంతం గా ఎదుర్కొంటాం

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!