మహారాష్ట్ర లో పులి దాడిలో నలుగురు మహిళలు మృతి..!
పొలిటికల్ పవర్ పిఎన్ 9 న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మే 22 2026: శుక్రవారం రోజు ఆకులు ఎరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలు పులి దాడిలో మృతి .! భయాందోళనలో గంజేవాహి అటవీ ప్రాంత ప్రజలు.! అడవిలో బీడీ ఆకులు ఏరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలపై ఒకేసారి పులి దాడి చేసి చంపిన సంఘటన మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా గంజేవాహి అటవీ ప్రాంతంలో చోటుచేసుకొంది.! దీంతో సిందేవహి తాలుకాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు..!
ఉదయం పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రజలు ఎండిపోయిన బీడీ ఆకులు ఏరుకొనేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లగా ఉదయం 8 గంటల సమయంలో ఓ పులి మాటువేసి వారిపై దాడి చేసింది దీనితో ఘటనా స్థలంలోనే నలుగురు మహిళలు మృత్యువాత పడ్డారు..! మృతులను దాదాజీ మొహర్లే, అనుబాయి దాదాజీ మొహర్లే, సంగీతా సంతోష్ చౌదరీ, సునీతా కౌశిక్ మొహర్లేగా గుర్తించారు. వీరంతా 33 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యవారే…ఈ ఘటన తర్వాత అటవీ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు..! ఫారెస్ట్ రేంజి అధికారి అంజలీ సాయంకర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్నారు..! ఒకేసారి పులి దాడిలో నలుగురు మహిళలు చనిపోవడంతో అటవీ పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు…!
