
పొలిటికల్ పవర్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి నాగరాజు రెడ్డి
రాజకీయాల్లో పావులు కదపడం.. ఎత్తుకు పైఎత్తు వేయడం చాలా ముఖ్యం.చంద్రబాబు లాంటి నాయకుడ్ని ఢీకొనేటప్పుడు పక్కాగా వ్యూహం రచించాలి. పద్మవ్యూహం కంటే పదునైన, పకడ్బంది వ్యూహాన్ని రచించాలి. YS జగన్ అదే చేశారు.
YS జగన్ పన్నిన వ్యూహం ఎలా ఉందంటే.. చంద్రబాబు తనకు తానే ఉచ్చులో చిక్కుకునేలా ఉంది. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారనే వార్తలు వచ్చినప్పటి నుంచి YS జగన్ పక్కా వ్యూహంతో అడుగులేశారు. YSRCP నేతలను, శ్రేణులను అలర్ట్ చేస్తూ వచ్చారు. రాష్ట్రంలో కూటమి పాలన ఎలా ఉందో మాజీ ముఖ్యమంత్రి YS జగన్‌కు స్పష్టమైన అంచనాలు ఉన్నాయి. కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బలమైన అంచనాకు వచ్చాక YS జగన్ తన వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారు. తాడేపల్లి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లు, సమావేశాలతో నేతలకు దిశానిర్దేశం చేశారు
. లీగల్ టీమ్‌ను యాక్టివ్ చేశారు.అంటే..చంద్రబాబు అండ్ కో దాడులకు, దౌర్జన్యాలకు తెగబడుతుందని YS జగన్ టీమ్ ముందుగానే అంచనా వేసిందని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. YSRCP రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ.. జిల్లా నేతలను ముందుకు కదిలించారు. ఎక్కడా కూడా ఏకగ్రీవం కావడానికి వీళ్లేదని YSRCP అధ్యక్షుడు YS జగన్ పదేపదే చెబుతూ నేతల్లో పట్టుదలను పెంచారు.
ఒక్కసారి, రెండుసార్లు కాదు పదిసార్లకు పైగా నేతలకు తన మనసులో ఏముందో అర్థం చేసుకునేలా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. YS జగన్‌మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతో అడుగులేస్తుంటే.. ఇంటెలిజెన్స్ ఇచ్చే రిపోర్టులతో చంద్రబాబులో కలవరం మొదలైంది. ఏ రిపోర్ట్ కూడా ఫేవర్‌గా లేదు. రాయలసీమలోని జిల్లాలు, నెల్లూరులో మెజార్టీ, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ప్రభుత్వానికి ఏమాత్రం అనుకూలంగాలేదని రిపోర్ట్ లు చంద్రబాబు చేతికి అందాయి.
మరోపక్క వ్యూహాత్మకంగా YS జగన్ దూసుకెళ్తున్నారు. ఇక్కడే తన రాక్షస రాజకీయాన్ని మేల్కోలిపారు చంద్రబాబు. ఇక్కడ… YS జగన్ ప్రణాళికలు ఒక వైపు, ప్రభుత్వ వ్యతిరేకత మరో వైపు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేశాయి.
రాయలసీమ నేతలతో చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. నెల్లూరు, ప్రకాశం, పల్నాడు టీడీపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానాలు గెలవాలని.. అంతే అధినేత మనసులో ఏముందో అర్ధం చేసుకున్న టీడీపీ నేతలు రెచ్చిపోయారు.
నామినేషన్ల మొదటి రోజే హింసకు తెరలేపారు. YSRCP లోక్ సభ నాయకుడు మిథున రెడ్డి మీద దాడి చేశారు..హత్యాయత్నం చేశారు. రాయచోటిలో YSRCP ఆఫీస్‌కు నిప్పుపెట్టారు. కార్లను తగలబెట్టారు. ఇక్కడే చంద్రబాబు బ్లండర్ మిస్టేక్ చేశారు. ఎప్పుడైతే టీడీపీ నేతలు, కార్యకర్తలు హింసకుపాల్పడ్డారో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత మరింత ఎక్కువైంది.
రాయలసీమలో హింస తరువాత, పల్నాడులో టీడీపీ నేతల బీభత్సం తరువాత చాలా మంది ఓటర్లు ఒక్కటే అనుకున్నారు. “ఈ ఒక్కసారి ఓటు వేయకపోతే పోయేదేమీ లేదు..2029 ఎన్నికల్లో సత్తా చూపాలని”. 50శాతం మంది ఓటర్లు అనుకున్నది ఇక్కడ చెబుతున్నాను. కార్పొరేషన్ , మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ పాల్పడిన గూండాగిరి ఇంకా ప్రజల కళ్లల్లో మెదులుతూనే ఉంది.
ఈ ఎఫెక్ట్ రాష్ట్రంలోని మిగతా జిల్లాల మీద పడింది. నామినేషన్లు చించేయడం, బీ ఫాంలు చించేయడం, పోలీసులను పాలేర్లు వాడుకున్నట్లు వాడేయడం, అధికారులు చట్టాన్ని మర్చిపోవడం ఇవన్నీ ప్రజలు గమనిస్తూ వచ్చారు. అందుకే… కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల చివరి రోజుల్లో మహిళలు తొడగొట్టి నిలబడ్డారు.
రండి దమ్ముంటే అంటూ YSRCP మహిళలు నిలబడ్డారు. కార్పొరేషన్ , మున్సిపల్ ఎన్నికల్లో రిగ్గింగ్, సైక్లింగ్, దొంగ ఓట్లు టీడీపీ నేతలు వేసుకోవడాన్ని ప్రజలు గమనించారు. చంద్రబాబు క్షేత్రస్థాయిలో పథకాలు అమలు చేయకపోవడం.. అభివృద్ధి కనిపించకపోవడం, తెల్లారితే అమరావతి జపం, ఎన్నికల్లో హింస ప్రజలను దీర్ఘాలోచనలోకి నెట్టేశాయి.
ఈ ఫలితాలే.. ZPTC, MPTC ఎన్నికల్లో ప్రతిబింబించాయి.
టీడీపీ , కూటమి పార్టీలు పక్కాగా గెలుస్తాయని అనుకున్న చోటనే YSRCP అభ్యర్థులను నామినేషన్లు వేసుకోనిచ్చారు. టీడీపీ పక్కాగా గెలుస్తుంది అనుకున్న చోట కూడా YSRCP జెండా రెపరెపలాడటంతో చంద్రబాబు ఖంగుతిన్నారు.
కార్పొరేషన్, మున్సిపాలిటీ, ZPTC, MPTC ఫలితాలు వచ్చాక ఎక్కడైనా టీడీపీ, కూటమి పార్టీలు సంబరాలు చేసుకోవడం చూశారా..? కారణం కూటమి పార్టీలకు కూడా తెలుసు హింసతో కూడిన గెలుపు గెలుపేకాదని. కానీ.. YSRCP నేతలు మాత్రం సంబరాలు చేసుకున్నారు.
దాదాపు 80 ZPTCలు, 1200 MPTCలు YSRCPకి రావడం మాములు విషయం కాదు. YSRCP హయాంలో ఓటమి భయంతో టీడీపీ నేతలు పోటీ కూడా చేయలేదు. కానీ.. ఇప్పుడు YSRCP శ్రేణులు కూటమి కుట్రలు, దాడులు, గూండాగిరిని తట్టుకోని నిలబడి యుద్ధమే చేశాయి. 2029 ఎన్నికలకు తాము ఎలా ఉండబోతున్నామో YSRCP నేతలు, కార్యకర్తలు కూటమి పార్టీలకు బలమైన మెస్సేజ్ పంపారు.
ఇక్కడ YS జగన్ రాజకీయ చదరంగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్థానిక ఎన్నికలపై YS జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడంతో చంద్రబాబులో భయం మొదలైంది.
ఈ భయంతో దాడులకు దిగారు. ఈ దాడులు చంద్రబాబుకు మరింత మైనస్ అయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ చంద్రబాబు ఎన్నికలు నిర్వహిస్తే ఆయన ఇమేజ్ పెరిగేది.కానీ.. ఇప్పుడు చంద్రబాబు ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతోన్న కూడా YS జగన్ ఎక్కడా అప్రజాస్వామికంగా వ్యవహరించలేదు. ఎదురొడ్డి ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని తమ కార్యకర్తలకు, నేతలకు చెప్పారు. క్యాడర్‌లో ఎప్పటకప్పుడు ధైర్యాన్ని నింపుతూ వచ్చారు. స్పూర్తిని నింపారు. ఈ వ్యూహంలో చిక్కుకున్న టీడీపీ నేతలు మరింత హింసను రాజేశారు.
దీంతో.. ప్రజల్లో YSRCP పట్ల మరింత సానుభూతి పెరిగింది.మరోవైపు.. 2029లో కూటమిని ఎదుర్కోవడానికి YSRCP శ్రేణులకు ఈ ఎన్నికలు నెట్ ప్రాక్టీస్‌లా ఉపయోగపడ్డాయి.
బీజేపీ కలిసి ఉంది కాబట్టి చంద్రబాబు ఆటలు సాగుతోన్నాయి. వచ్చే రోజుల్లో చంద్రబాబుతో బీజేపీ కలిసి ఉంటుందని చెప్పలేం. రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ఏమైనా జరగొచ్చు. చంద్రబాబుతో బీజేపీ కటీఫ్ చెబితే.. చెబితే కాదు చెప్పాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. చంద్రబాబుతో కలిసి ఉంటే కమలనాథుల పుట్టి కూడా మునిగిపోతుంది. ఒకవేళ.. కూటమి నుంచి బీజేపీ బయటకు వెళ్తే..CEC చంద్రబాబుకు సహకరిస్తుందా..? పోలీసులు సహకరిస్తారా..? అధికారులు సహకరిస్తారా..? సో.. YS జగన్ వ్యూహం కంటిన్యూ కాబట్టి ఏమైనా జరగొచ్చు. AK 47లకు ఎదురొడ్డి నిలిచిన YSRCP గుండెలు ఇప్పుడు 2029 కోసం ఎదురు చూస్తున్నాయి.

