ePaper
Friday, November 13, 2026
📄 ePaper

*ధరణి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ శైలజ* 

📰 Generate e-Paper Clip

 

మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి

 

మేడిపల్లి: 12 నవంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ

 

మేడిపల్లి డివిజన్ పరిధిలోని ధరణి కాలనీలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై నిన్న జోనల్ కమిషనర్ మరియు,డిప్యూటీ కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.అలాగే ఈ విషయంపై డీసీసీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ ప్రత్యేక చొరవతో అధికారుల మధ్య సమన్వయంతో,ఈరోజు మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవితో కలిసి సందర్శించిన డిప్యూటీ కమిషనర్ శైలజ కాలనీ అధ్యక్షులు చింతం చంద్రశేఖర్, జనరల్ సెక్రెటరీ బిమిడి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి చంద్ర శేఖర్ మరియు కాలనీ వాసులతో కలిసి ధరణి కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటించి, కాలనీలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా, వారి సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషన్ శైలజ హామీ ఇచ్చారు.

తుంగతుర్తి రవి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ఏఈ సాయి కిరణ్, వర్క్ ఇన్స్పెక్టర్ లింగస్వామి,ధరణి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చింతం చంద్ర శేఖర్, జనరల్ సెక్రెటరీ బిమిడి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి చంద్ర శేఖర్ మరియు కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest Articles

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జారె శ్రీకారం!

మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన.. ఇంకుడు గుంతల పనులకు భూమిపూజ నీటి సంరక్షణకు...

మోజర్ల గ్రామంలో బాలల సభ నిర్వహణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఉపాధి హామీ పనులకు శ్రీకారం -సర్పంచ్ చంద్రశేఖర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

బాబోయ్ పెద్దపులి..! అటవీ ప్రాంత గ్రామాల్లో మళ్లీ భయాందోళనలు

ఏపీలోని వేలేరుపాడు మండలం కొత్తూరు వద్ద మూడు ఆవులు హతం గోదావరి పరివాహక...

1/70 చట్టం జోలికొస్తే సహించేది లేదు!

ఆదివాసుల హక్కులు, భూముల పరిరక్షణ కోసం నవంబర్ 30న తహసీల్దార్ కార్యాలయం...

Related Articles

వైఎస్ జగన్ వ్యూహంలో చిక్కుకున్న చంద్రబాబు..!

పొలిటికల్ పవర్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి  నాగరాజు రెడ్డిరాజకీయాల్లో పావులు కదపడం.. ఎత్తుకు పైఎత్తు వేయడం చాలా ముఖ్యం.చంద్రబాబు లాంటి నాయకుడ్ని ఢీకొనేటప్పుడు పక్కాగా వ్యూహం రచించాలి. పద్మవ్యూహం కంటే పదునైన, పకడ్బంది వ్యూహాన్ని...

హైదరాబాద్‌పై కమ్ముకొస్తున్న కాలుష్య ముప్పు:  మరో ఢిల్లీగా మారుతుందా?*

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ​భారతదేశ సాంస్కృతిక, పారిశ్రామిక నగరాలలో ఒకటైన...

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి 6 నెలల జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / PN9 TV తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్యూరో — యర్ర నాగరాజు రెడ్డిహైదరాబాద్ (పొలిటికల్ పవర్ బ్యూరో): న్యాయస్థాన ఆదేశాలను...
error: Content is protected !!