ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంసత్తుపల్లిలో సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు

సత్తుపల్లిలో సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు

📰 Generate e-Paper Clip

8వ రోజుకు.. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల సంఘీభావం

పే అప్‌గ్రేడేషన్, పి.ఆర్.పి. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ జులై 06 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏరియాలో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (సీఎంఓఏఐ) సింగరేణి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయం ఎదుట జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించి అధికారుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విటల్‌రావు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు జాజిరి శ్రీనివాసరావు దీక్షా శిబిరాన్ని సందర్శించి అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పే అప్‌గ్రేడేషన్, పర్‌ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పి.ఆర్.పి.) బకాయిల చెల్లింపు వంటి న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టిన ఉద్యమానికి తమ సంఘాల పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎనిమిదో రోజు దీక్షలో డీజీఎం (ఈ అండ్ ఎం) కిష్టారం ఓసీపీకి చెందిన జి.వి. రావు, ఈఈ (ఈ అండ్ ఎం) జేవీఆర్ ఓసీపీకి చెందిన కె. జగదీష్, ఈఈ (ఈ అండ్ ఎం) జేవీఆర్ సీహెచ్‌పీకి చెందిన జి. శ్రీనివాస్, సీనియర్ యూ.ఎం జేవీఆర్ ఓసీపీకి చెందిన మహమ్మద్ జహీద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు “పే అప్‌గ్రేడేషన్ – పి.ఆర్.పి. మా హక్కు” అంటూ నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను వినిపించారు. సింగరేణి ఎగ్జిక్యూటివ్ అధికారులకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పే అప్‌గ్రేడేషన్‌ను వెంటనే అమలు చేయాలని, నిలిపివేసిన పి.ఆర్.పి. బకాయిలను ఆలస్యం చేయకుండా చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ… సంస్థ అభివృద్ధి కోసం అధికారులు నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ వారి న్యాయమైన సమస్యలపై యాజమాన్యం స్పందించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తక్షణమే చర్చలు ప్రారంభించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దీక్షా శిబిరంలో పాల్గొన్న అధికారులు “జై సి.ఎం.ఓ.ఎ.ఐ… జై జై సి.ఎం.ఓ.ఎ.ఐ…” అంటూ నినాదాలు చేస్తూ తమ ఐక్యతను చాటుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!