ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపసీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ పెట్టుకోవాలి రెండు సంవత్సరాల లో ఉక్కు పరిశ్రమ పనులు...

సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ పెట్టుకోవాలి రెండు సంవత్సరాల లో ఉక్కు పరిశ్రమ పనులు పూర్తిచేసి ప్రారంభించాలి.

📰 Generate e-Paper Clip

డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని.

పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా బద్వేల్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున జమ్మలమడుగులో ఉక్కు పనులకు పున: ప్రారంభం సభలో రెండు సంవత్సరాలలో పనులు పూర్తి చేసి పరిశ్రమ ప్రారంభిస్తామని చెప్పడం జరిగిందని సంతోషించ దగ్గ విషయమేనని కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియంచిన్ని తెలిపారు. శనివారం అట్లూరు మండల కేంద్రంలో డివైఎఫ్ఐ మండల కమిటీ సమావేశానికి హాజరైనారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం కడప ఉక్కునుజె ఎస్ డ బ్ల్యు భాగస్వామ్యంతో కలిసి ఉక్కు పరిశ్రమ పున ప్రారంభం కింద ముఖ్యమంత్రి వచ్చి పనులు ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమేనని వారన్నారు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛన కడప ఉక్కు పరిశ్రమ అన్నారు ముఖ్యమంత్రి సభలో రెండు సంవత్సరాలలో పనులు మొదటి దశ పూర్తి చేసి పరిశ్రమ ప్రారంభిస్తామని గట్టిగా చెప్పడం జరిగిందని చెప్పిన మాటకు ఆచరణలో పెట్టాలని ఎందుకంటే గతంలో ఇదే హామీలు ఇచ్చారని నాడు కంబాల దీన్నే లో పైలాన్ ఆవిష్కరణలో ఇలాగే చెప్పారని తర్వాత మహానాడు వేడుకలో కూడా చెప్పారని కావున మళ్లీ హామీల కాకుండా రెండు సంవత్సరాల లో పూర్తిచేసి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

అట్లూరు మండల అధ్యక్షుడు ఈరిగోపాలయ్య

అధికారంలో ఎవరున్నా ఉక్కు పనులు ఆగకుండా ముందుకు సాగేలా ఉండాలని వారు కోరారు. అనంతరం డివైఎఫ్ఐ అట్లూరు నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడుగా . ఈ గోపలయ్య మండల ప్రధాన కార్యదర్శిగా : ఆర్ భాస్కర్ మండల ఉపాధ్యక్షులుగా

డివైఎఫ్ఐ అట్లూరు మండల కార్యదర్శి రేవూరి భాస్కర్

ఈ చిన్నయ్య, ఈ బాలకృష్ణ, ఆర్ అజయ్, ఏ విష్ణువర్ధన్ మండల సహాయ కార్యదర్శిగా జి భాను తేజ, ఆర్ గోపాలకృష్ణ, ఈ కృష్ణయ్య, ఆర్ అంజి మండల కోశాధికారిగా ఆర్ ఉదయ్ కుమార్ మండల కమిటీ సభ్యులుగా జి రామ్ చరణ్ కె మల్లికార్జున ఆర్ అఖిల్ ఆర్ అనిల్ కే నాని బి చందు ఆర్ కిరణ్ ఆర్ రేవంత్ లను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నిక డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని అధ్యక్షతన ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!