నాగార్జున యాదవ్ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన నాయకులు
పొలిటికల్ పవర్ దినపత్రిక పిఎన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జగన్ రెడ్డి పెంపుడు కుక్క, పేటీఎం, పెయిడ్ ఆర్టిస్ట్ నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి “డెలివరీ బాయ్” అంటూ చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను సౌత్ ఇండియా రాహుల్ గాంధీ యూత్ ఫోర్స్ నాయకులు చీళ్ళ నాగేశ్వరరావు, గట్టె ప్రసాదరావు (ప్రభు) ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. గతంలో చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని వార్తలు వస్తున్నాయని, అయినప్పటికీ సమయం, సందర్భం లేకుండా గొడ్డలి పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ చేసిన వ్యాఖ్యలను తెలుగు సమాజం ఏవగించుకుంటోందని పేర్కొన్నారు. ఈ నోటి దూలతోనే ఏపీలోని గొడ్డలి పార్టీని 151 సీట్ల నుంచి ప్రతిపక్షానికి కూడా పనికిరాకుండా 11 స్థానాలకు ప్రజలు పరిమితం చేశారని అన్నారు. జడ్‌పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం స్వయంకృషి, ప్రజాబలంతో నిర్మితమైందని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికల విజయం కాంగ్రెస్ పార్టీదేనని, కాగా గొడ్డలి పార్టీ జగన్ స్వంత జిల్లా, స్వంత ఊరిలో కూడా డిపాజిట్లు కోల్పోయిందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి నాగార్జున యాదవ్‌కు లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై రాష్ట్ర డీజీపీ సుమోటోగా కేసు నమోదు చేసి, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.


