కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దనుక రాధిక (44) ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్ల బిల్లుల క్లియరెన్స్‌ను వేగవంతం చేయడానికి అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ, బినామీ ఖాతాల ద్వారా అక్రమ కమిషన్లు వసూలు చేసినట్లు ఏసీబీ విచారణలో గుర్తించింది. అలాగే ఈ లావాదేవీల కోసం ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

