ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

180 ఏళ్ల పబ్లిక్ గార్డెన్స్‌కు ఎసరు పెట్టిన రేవంత్ ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక 9టీవీ తెలుగు న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి జూన్ 13 2026: సుమారు 54 ఎకరాల్లో నిజాంల కాలంలో నిర్మించిన భాగ్-ఏ-ఆమ్, తదనంతర కాలంలో పబ్లిక్ గార్డెన్స్‌గా పేరొందింది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కళ్లు ఈ పేదవాడి గార్డెన్స్ మీద పడింది. తెలుగు యూనివర్సిటీ దగ్గరి నుండి లక్డీ-కా-పూల్ జంక్షన్ వరకూ కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ ఈ పబ్లిక్ గార్డెన్ మీదుగా కట్టాలని అధికారులు డిజైన్ రూపొందించారని, దానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం మొదలుపెట్టింది. ఈ ఫ్లైఓవర్ కడితే నగరం నడిబొడ్డున ఉన్న అతికొద్ది పచ్చని పార్కుల్లో ఒకటైన పబ్లిక్ గార్డెన్స్ నామ రూపాల్లేకుండా పోయే ప్రమాదం ఉంది. గత ఏడాది కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవిని నరికేసి సుప్రీం కోర్టు చివాట్లు తిన్నది రేవంత్ ప్రభుత్వం. మొన్నటికి మొన్న కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం వందలాది చెట్లు నరికేస్తే మరోసారి సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఈ హరితహననం ఆపేసింది. పచ్చదనం తక్కువై, నగరంలో ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్నాయి. కుంభవృష్టి లాంటి వర్షాలు ఎక్కువయ్యాయి. అయినా తీరుమార్చుకోని రేవంత్ ప్రభుత్వం, నగరంలో ఉన్న అతి పురాతన పబ్లిక్ గార్డెన్స్ మీద గొడ్డలి వేటు వేయనున్నది.

Latest Articles

వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలపై క్షేత్ర సందర్శన

చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాల గుర్తింపు.. రైతులకు శాస్త్రీయ సూచనలు పొలిటికల్...

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

వరుణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాధుడు ఆగమనం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ఏ హేమంత్ సాగర్ కూకట్ పల్లి వరుణ్ గౌడ్ ఆధ్వర్యంలో టీమ్ భైరవ్‌ గణేష్‌...

రామ్ కృష్ణ గుప్తా జన్మదిన వేడుకల్లో అన్నదానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కూకట్ పల్లి ప్రతినిధి సెప్టెంబర్ 07 2026: కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలోని 246వ డివిజన్ బీజేపీ...

నేరేడ్మెట్ ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు పొలిటికల్ పవర్ తెలుగు జాతీయ దినపత్రిక పిఎన్ 9 న్యూస్ తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో మహేందర్ యాదవ్మల్కాజ్గిరి నేరేడ్మెట్ ఘనంగా కృష్ణాష్టమి వేడుకలుఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు...
error: Content is protected !!