ePaper
Thursday, September 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఈ నెల 6 వ తేదీన చిత్ర కళా పోటీలు..

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

బోనాలు, కృష్ణాష్టమి పండుగలను పురస్కరించు కుని సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ 44వ చిత్ర కళా పోటీలను ఈ నెల 6 వ తేదీ ఆదివారం కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డు హనుమకొండ లోని భారతి విద్యా భవన్ స్కూల్ లో ఉదయం 10 గంటలకు 5 విభాగాల్లో చిత్ర కళా పోటీలు నిర్వహిస్తున్నట్టుగా అకాడమీ డైరెక్టర్ డా. మంజుల సాగంటి ఒక ప్రకటన లో తెలిపారు.. రెండు గంటల్లో రెండు అంశాల పైన రెండు చిత్రాలు వేయవలసిందిగా ఉంటుందని.. బోనలు మరియు కృష్ణాష్టమి పండుగలకు సంబంధించి చిత్రాలు వేయాల్సిన ఉంటుంది… గెలుపొందిన వారికి 15 బహుమతులతో పాటు పాల్చొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు అందిస్తామన్నారు.పండుగల విశిష్టత తెలిసేలా ప్రత్యేక వేశాధారణ పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు… అమ్మవారు, బోనం ఎత్తిన మహిళా, పోతురాజు, కృష్ణుడు, గోపీక ఇలా ప్రత్యేక వేశాధారణ లో చిన్నారులు పగోనాల్సి ఉంటుంది… వీరికి నాలుగు విభాగాల్లో 12 బహుమతులు అందిస్తామన్నారు.. చిత్ర కళా పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా ఇతర వివరాలకు 8143643337 లో సంప్రదించవచ్చని తెలిపారు..

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!