ePaper
Saturday, September 5, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన జయంతి వేడుకలు.

లక్షెట్టిపేట. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాలలో

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రమా కల్యాణి మాట్లాడుతూ… “ఒక విద్యార్థి భవిష్యత్తును మార్చగల శక్తి గురువుల్లోనే ఉంది. గురువు కేవలం పాఠాలను బోధించే వ్యక్తి మాత్రమే కాదు, విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి అతని లక్ష్యానికి దిశానిర్దేశం చేసే శిల్పి” అని అన్నారు. అనంతరం పేరెంట్స్ కమిటీ సభ్యులు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు శాలువాలతో సన్మానం చేశారు  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తమ గురువులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు, పేరెంట్స్ కమిటీ సభ్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!