స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్
బహుజనులంతా ఏకమై బీఆర్‌ఎస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తాం: ఊటుకూరి రంజిత్
కొణిజర్ల: దళిత వర్గానికి చెందిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కొణిజర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊటుకూరి రంజిత్ అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఊటుకూరి రంజిత్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ప్రారంభమైన తొలిరోజే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్, హరీశ్‌రావు తదితరుల ఆధ్వర్యంలో జరిగిన తోపులాట ఘటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, మహిళా కానిస్టేబుల్ సమక్షంలో టీ-షర్ట్ విప్పి దౌర్జన్యంగా వ్యవహరించడం, విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడం వంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదన్నారు.
యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలని ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో రౌడీయిజం, దౌర్జన్యాలకు తావు ఇవ్వడం సరికాదని అన్నారు.
దళిత వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు సముచిత సమయం కేటాయిస్తూ సభను సజావుగా నడిపిస్తున్నారని రంజిత్ తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ తదితర పార్టీల సభ్యులకు కూడా సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తూ అందరికీ సమానంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
అలాంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దళిత వర్గాలను అవమానించడమేనని ఊటుకూరి రంజిత్ పేర్కొన్నారు. చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే బహుజనులు, దళిత వర్గాలన్నీ ఏకమై బీఆర్‌ఎస్ పార్టీకి రాజకీయంగా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
దళిత వర్గానికి చెందిన వ్యక్తి అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న విషయాన్ని గౌరవించాలని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఊటుకూరి రంజిత్ ఒక ప్రకటనలో తెలిపారు.
