అంగన్వాడీ కేంద్రాల్లోనే చిన్నారులకు మెరుగైన విధ్యాబ్యాసం
సూర్య గంగ రవి సర్పంచ్, పెద్దమందడి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 03 మే 2026: పెద్దమందడి మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ సూర్య.గంగ రవి, ఉప సర్పంచ్ బోయిని. ఉషన్న యాదవ్ తో కలిసి, 2వ సెంటర్, మరియు 4వ సెంటర్, అంగన్వాడీ సెంటర్స్ లో పాలు, గుడ్లు పంపిణీ చేయడం జరిగింది. పిల్లలకు చిన్న తనం నుంచే నాణ్యమైన విద్య అందించడంలో అంగన్వాడి కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తాయని గ్రామ సర్పంచ్ అన్నారు. మండల పరిధిలోని 2, 4 వ అంగన్వాడీ కేంద్రాల అధ్యర్యంలో, శనివారం పాలు, గుడ్లు పంపిణీ కార్యాక్రమంలో గ్రామ సర్పంచ్ సూర్య.గంగ రవి మాట్లాడుతూ… అంగన్వాడీ కేంద్రాల్లో కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, పిల్లలకి అర్థమయ్యే రీతిలో కథలు, ఆటలు, పాటల ద్వారా విద్యను బోధించడం అభినందనీయం అని అరే కొనియాడారు. నిర్బంధ విద్య కంటే ఆసక్తికరమైన పద్ధతుల్లో బోధించడం వల్ల పిల్లల్లో సృజనాత్మక పెరుగుతుందని అన్నారు. కేవలం విద్యాబోదనే కాకుండా, అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. దీనివల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా, ఎదుగుతారని, కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యాక్రమంలో, గ్రామ సర్పంచ్ సూర్య గంగ రవి, గ్రామ ఉప సర్పంచ్ బోయిని ఉషన్న యాదవ్, టైలర్.రవి మరియు అంగన్వాడీ ఉపాధ్యాయురాలులు రమాదేవి, రాణి ఆయాలు అంజమ్మ, సాయి లీలా, చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాలుగోన్నారు.
