ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఖాకీ దైర్యం అంటే ఇదే… మల్కాజ్‌గిరి సీపీ సుమతి సంచలన ఆపరేషన్!*

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్

మహిళల భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని మరోసారి నిరూపించారు మల్కాజ్‌గిరి సీపీ సుమతి. సాధారణ మహిళలా వేషం వేసి అర్ధరాత్రి రోడ్లపై స్వయంగా నిలబడి, సమాజంలో దాగి ఉన్న అసలు సమస్యను బయటపెట్టిన తీరు నిజంగా అభినందనీయం.దిల్‌సుఖ్‌నగర్ పరిసరాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 వరకు కొనసాగిన ఈ స్పెషల్ ఆపరేషన్‌లో సీపీ సుమతి చూపిన ధైర్యం, తెలివితేటలు పోలీస్ వ్యవస్థకు గర్వకారణం. కామన్ లేడీగా నిలబడి ఉన్న ఆమెను టార్గెట్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలను ఒక్కొక్కరిని కట్టడి చేయడం ద్వారా మహిళలపై జరుగుతున్న వేధింపుల నిజ స్వరూపాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.వస్తావా? రేటెంత?”* వంటి అసభ్య పదజాలంతో వేధించిన పోకిరీలకు ఈ ఆపరేషన్ గట్టి హెచ్చరికగా మారింది. మొత్తం 40 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీరిలో ఎక్కువమంది విద్యార్థులు, ఉద్యోగార్థులే కావడం ఆందోళన కలిగించే అంశం.ఈ ఘటనతో సమాజానికి ఒక బలమైన సందేశం వెళ్లింది.మహిళలపై వేధింపులు చేస్తే ఎవరైనా సరే చట్టం ముందు తలవంచాల్సిందే. సీపీ సుమతి తీసుకున్న ఈ ధైర్య నిర్ణయం మహిళల భద్రతకు ఒక కొత్త దిశ చూపించింది. ఖాకీ యూనిఫాం ధరించిన నిజమైన సింగం అంటే ఇదే అని అందరూ ప్రశంసిస్తున్నారు.ఇలాంటి అధికారులు ఉన్నంత వరకు మహిళలకు భయం అవసరం లేదు అనే నమ్మకం మరింత బలపడింది.

*స్టేట్ బ్యూరో,నిజం న్యూస్*

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!