జూలూరుపాడు: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ :. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జూలూరుపాడు మండల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు వీరు నాయక్ ఆధ్వర్యంలో మండల ఉపాధ్యక్షుడు కంచ పోగు నరసింహారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు. అలాగే తాసిల్దార్ కార్యాలయంలో, ఎంపీడీవో కార్యాలయంలో, ఎంఈఓ కార్యాలయంలో, కరెంట్ ఆఫీస్ లో, అగ్రికల్చర్ ఆఫీస్ లో, 24 గ్రామ్ పంచాయతీలలో, మరియు మండలంలో ఉన్న ఎంపీపీ ఎస్ ,యు పి ఎస్ ,జడ్పీఎస్ఎస్ , జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మరియు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వీరు నాయక్ మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతంతో దేశభక్తి భావాలను చాటుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఐక్యత, సమగ్రత మరియు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు రేహన్షి , రుత్విక, జూలూరుపాడు మండల ప్రెస్ క్లబ్ కార్యదర్శి భూరం రమేష్, గౌరవ సలహాదారు బానోత్ రమేష్, గోపి నాయుడు,కోశాధికారి మంద లక్ష్మణ్, నాయి బ్రాహ్మణ సంఘ మండల అధ్యక్షుడు మాడుగుల నాగరాజు, బుచ్చిబాబు, గోపాల్, గోపాలరావు, నరేష్, కృష్ణమూర్తి మరియు తదితరులు పాల్గొన్నారు.
