కంచిరావుపల్లి లో బీరప్పల పండుగలకు హాజరైన ఎమ్మెల్యే
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 11 2026: పెబ్బేరు మండల కంచిరావుపల్లి లో సోమవారం నిర్వహించిన బీరప్పల పండగలకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. గ్రామాల్లో నిర్వహించే ఇలాంటి పండగలు గ్రామస్తుల మధ్యన ఐక్యతను నెలకొల్పుతాయని ఇలాంటి పండగలు నిర్వహించుకోవడం ఆనందదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీరప్ప పండుగలు నిర్వహించిన వారికి తన విరాళంగా 1 లక్షల రూపాయలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు మండల శ్రీరంగాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
