బండి సంజయ్ కాదు భంగి సంజయ్.
సనాతన ధర్మం అని నీతులు వల్లించే సంజయ్ నీ కొడుకును శిక్షించు. మైనర్ బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి. బిజెపి పార్టీది, కాంగ్రెస్ పార్టీది చీకటి స్నేహం.
గట్టు యాదవ్ జిల్లా మాజీ అధ్యక్షులు.
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 11 2026: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి.సాయి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ… రాజ్యాంగ పదవిలో ఉంటూ నిత్యం సనాతన ధర్మం రక్షణ భేటీ బచావో భేటీ పడావ్ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే బండి సంజయ్ వెంటనే తన కొడుకు బండి భగీరత్ ను అరెస్టు చేయించి విచారణకు ఆదేశించాలని గట్టు యాదవ్ డిమాండ్ చేశారు. కెటిఆర్ మీద డ్రగ్స్ ఆరోపణలు చేయడం నిరూపించలేకపోవడం నీ అసమర్థత అని దుయ్యబట్టారు. సంజయ్ నీలాగా నీ కొడుకు కూడా తంబాకు, డ్రగ్స్ వాడి అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటే చర్యలు తీసుకోవా అని ప్రశ్నించారు. ఫోక్సో కేసు నమోదు చేసి 50గంటలు గడుస్తున్న నీ చీకటి మిత్రుడు రేవంత్ రెడ్డి సహకారంతో బాధితులను బెదిరిస్తూ కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నావు అని దుయ్యబట్టారు. వెంటనే సాయి భగీరథ్ ను అరెస్టు చేయకపోతే బిఆర్ఎస్ ఆధ్వర్యములో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో నందిమల్ల అశోక్, కె మాణిక్యం,గంధం పరంజ్యోతి, రఘు వర్ధన్ రెడ్డి, కౌన్సిలర్స్ మురళీ సాగర్ శ్రీకర్ గౌడ్, ప్రేమ్ నాథ్ రెడ్డి, నాగన్న యాదవ్, బొబ్బిలి ప్రేమ్ కుమార్, నీలస్వామి, హేమంత్ ముదిరాజ్, జోహెబ్ హుస్సేన్, ధర్మా నాయక్, అస్లాం, కవితా నాయక్, ఇమ్రాన్, సూర్యవంశం గిరి, ముని కుమార్, చిట్యాల రాము, పోతులపల్లి రాజు, సయ్యద్ జెమిల్, నందిమల్ల రమేష్, విష్ణు సాగర్, జె శ్రీనివాసులు, చిలుక సత్యం, మంద రాము, నందిమల్ల సుబ్బు, అనపటి రాము తదితరులు పాల్గొన్నారు.
