హనుమాన్ జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక పూజలు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పి ఎన్వ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 12 2026: వనపర్తి పట్టణంలో 9వ వార్డు లక్ష్మీనరసింహస్వామి కాలనీలో ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పాలాభిషేకం, దధ్యాభిషేకం, తేనాభిషేకం, చక్కెరాభిషేకం, తీర్థాభిషేకం, సింధూరాభిషేకం తదితర విశేష అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ గ్రామాన ఆంజనేయ స్వామి ఆలయాలు కొలువై ఉండటం ఆనందకర విషయమని, ఆంజనేయ స్వామి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మహేశ్వరి, మాజీ జెడ్పీటీసీ గొల్ల వెంకటయ్య, మాజీ కౌన్సిలర్ విభూది నారాయణ, చీర్ల ఆంజనేయులు, చీర్ల జనార్ధన్, కాలనీవాసులు మరియు భక్తులు పాల్గొన్నారు.
