ఖమ్మం జిల్లా: చింతకాని మండలం, అనంతసాగర్ గ్రామంలో పాగి మారతమ్మ సంతాప సభ
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎస్ వీరబాబు ప్రఖ్యాత కళాకారుడు పాగి వెంకన్న తల్లి పాగి మారతమ్మ సంతాప సభ గురువారం చింతకాని మండలం అనంతసాగర్ గ్రామంలో నిర్వహించారు.
ఈ సభకు గాయకుడు పమ్మి రవి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, గాయకుడు యశ్పాల్, జర్నలిస్టు నేత చిర్ర రవి, తెలంగాణ శ్రీను, న్యాయవాదులు దేవిరెడ్డి విజయ్, నరేందర్, వీబీచారి, సంపత్, తెలంగాణ ఉద్యమకారిణి కోలా కరుణతో పాటు కళాకారులు పమ్మి రవి, రాయబారపు అర్జున్‌రావు, వెంగళ సుధాకుమారి, పెదపాక విజయ్, భద్ర, జాను, కోటి, గురవయ్య, ముత్యం, సతీష్, నరసింహారావు, జాగేటి, ఎన్‌వీ, రాంబాబు, రాజ్, ముత్తయ్య, శ్రీకాంత్, వెంకటరత్నం, హుస్సేన్, లక్ష్మణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. సభలో పలువురు కళాకారులు పాగి మారతమ్మను స్మరించుకుంటూ భావోద్వేగభరితమైన పాటలు ఆలపించారు. ఆమె జీవితం, కుటుంబానికి అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తమ మద్దతు తెలియజేశారు.
