ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంఫోక్సో నిందితుడు గౌస్ ను కఠినంగా శిక్షించాలి 

ఫోక్సో నిందితుడు గౌస్ ను కఠినంగా శిక్షించాలి 

📰 Generate e-Paper Clip

 

మైనర్ బాలికకు మెరుగైన వైద్యం అందించాలి 

నిరుపేద బాలిక కుటుంబానికి ఆదుకోవాలి 

 ___ పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు ధర్మపురి భవాని డిమాండ్ 

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జూన్ 11 2026: నిరుపేద మైనర్ బాలికపై అత్యాచారాన్ని పాల్పడ్డడమే కాకుండా హత్య చేసేందుకు దిగజారిన ఫోక్సో నిందితుడు మహమ్మద్ గౌస్ ను కఠినంగా శిక్షించడ మే కాకుండా విషమ పరిస్థితి లో ఉన్న మైనర్ బాలికకు మెరుగు అయిన వైద్యం అందించాలి. బాలిక కుటుంబానికి ఆదుకోవవాలి పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ మహిళా అధ్యక్షులురాలు ధర్మపురి భవాని మంగళ వారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్రం లో జరిగిన ఒక ఫోక్సో కేసులో పోలీసులు నిందితుడి అరెస్ట్ విషయంలో చేసిన నిర్వాకం వలే కాకుండా పోలీసులు సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కేసు విషయంలో కూడా రాజకీయ జోక్యం పై ఆరోపణలు వస్తున్నాయని, పోలీసులు వాటికి ప్రభావితం కాకుండా నిరుపేద బాలికకు, బాలిక కుటుంబానికి న్యాయం చేసే విధంగా దర్యాప్తు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఈ విషయంలో మీన వేషా లు వేయకుండా తక్షణమే బాధితుల పక్షం నిలబడి, ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు. మరోసారి రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!