ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తి"వార్షిక తనిఖీలలో " భాగంగా పెద్దమందడి పోలీస్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి,...

“వార్షిక తనిఖీలలో ” భాగంగా పెద్దమందడి పోలీస్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి, ఐపీఎస్.,

📰 Generate e-Paper Clip

ప్రజలకు న్యాయం పోలీసులకు బాధ్యత బాధితుల్లో భరోసా పెంచేలా సేవలందించాలి

రోడ్డు ప్రమాదాల నివారణ, అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా వ్యవహరించాలి

గంజాయి, మట్కా, పేకాటపై కఠిన నిఘా ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

బ్లూ కోల్డ్స్, పెట్రో కార్ విధులు నిర్వహించే సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 18 2026: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడు పోలీసు శాఖ తనకు అండగా ఉందనే నమ్మకంతో తిరిగి వెళ్లాలి. బాధితులకు న్యాయం చేయడం, ప్రజలకు భద్రత కల్పించడం, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం ప్రతి పోలీసు అధికారికి ప్రధాన బాధ్యతని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి, ఐపీఎస్ అన్నారు. గురువారం రోజు వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి పోలీస్టేషన్ “వార్షిక తనిఖీలలో ” భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి, ఐపీఎస్ సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా పోలీస్టేషన్ చేరుకున్న ఎస్పీకి పోలీసు అధికారులు పూల మొక్కలందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పోలీస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్ హెచ్ వో, మెన్ రెస్ట్ రూమ్, లాక్ అప్ రూమ్ ను తదితర ప్రదేశాలను పరిశీలించారు. స్టేషన్లో గురువారం రోజు వారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ,సెంట్రీ రిలీఫ్ బుక్, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్, బీట్ డ్యూటీ బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్, సుపీరియర్ ఆఫీసర్స్ విసిటింగ్ బుక్స్, ఫైనల్ రిపోర్ట్స్ తదితర రికార్డ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్టేషన్ పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, పెండింగ్ లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను పెద్దమందడి ఎస్సై, జలంధర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… పెద్దమందడి పోలీస్టేషన్ పరిధిలో గంజాయి, మట్కా, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. సాయంత్రం సమయాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలన్నారు. ముఖ్యంగా కేసుల దర్యాప్తునందు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సరైన సమయంలో దర్యాప్తు చేసి కోర్టుల నందు చార్జిషీటు దాఖలు చేసినప్పుడు బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు. దీర్ఘ కాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది మాట్లాడుతూ… పోలీసుశాఖ అందించిన కిట్ ఆర్టికల్స్ ను పరిశీలించి వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. అలాగే సిబంది నిర్వహిస్తున్న విధులు, పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయ అని తెలుసుకుని ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలనని స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయి అడిగి తెలుసుకొని గ్రామ పోలీస్ అధికారులు గ్రామాలను పూర్తిగా సమాచారం సేకరించి నేరాలు నిర్ములించాలని తెలిపారు.

విలేజ్ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గ్రామ పెద్దలు, యువతతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిభద్రతలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ హిస్టరీ షీటర్ల వివరాలను పరిశీలిస్తూ, వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. పగలు, రాత్రి బీట్ విధులలో భాగంగా అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను పాపిలాన్ డివైస్ ద్వారా తనిఖీ చేసి, పాత నేరస్తులను గుర్తించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చిన సీసీటీఎన్ఎస్-2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్, సీడీఆర్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లపై పూర్తి స్థాయి పట్టు సాధించి, నేరాల నియంత్రణలో సమర్థవంతంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ రికార్డులైన పార్ట్-1 నుండి పార్ట్-5 వరకు ఎలాంటి పెండింగ్ లేకుండా సీసీటీఎన్ఎస్-2.0లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే సిబ్బందికి వర్టికల్ వారీగా విధులు కేటాయించాలని ఎస్సైకి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాలలో రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ… మారుతున్న సమాజానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, సిబ్బంది ప్రతి ఒక్కరూ అన్ని రకాల విధులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రస్తుతం నేర్చుకుంటున్న పనితీరు మీ సేవా కాలమంతా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే పోలీస్ శాఖకు మంచి పేరు వస్తుందని అన్నారు. డ్యూటీ పరంగా లేదా వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచిస్తూ, హెల్మెట్ ధరించని సిబ్బందిని విధుల్లోకి అనుమతించకూడదని అధికారులకు సూచించారు.

పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పెద్దమందడి ఎస్సై, జలంధర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్లో అధికారుల సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ప్రారంభించి పాఠశాల విద్యార్థులతో వాలీబాల్ ఆడారు. ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, గిరిబాబు, కొత్తకోట సీఐ, రాంబాబు, పెద్దమందడి ఎస్సై, జలంధర్ రెడ్డి, డిసిఆర్బి ఎస్సై, తిరుపతి రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!