ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంకొత్తపల్లి జయశంకర్ 15వ వర్ధంతి ఘనంగా నిర్వహించిన టీయూఎఫ్ నాయకులు

కొత్తపల్లి జయశంకర్ 15వ వర్ధంతి ఘనంగా నిర్వహించిన టీయూఎఫ్ నాయకులు

📰 Generate e-Paper Clip

సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో జయశంకర్ సార్‌కు ఘన నివాళులు

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో వేంసూరు మండల నూతన కమిటీ ఎన్నిక

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 21 2026: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ( యు టి ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్.ఎస్. రెడ్డి, ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు గుంట్రు రామకృష్ణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి కిన్నెర వెంకటేశ్వరరావు, సత్తుపల్లి డివిజన్ అధ్యక్షుడు అబ్దుల్ హబీబ్, కార్యదర్శి మోరంపూడి అజయ్ ఘోష్ ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో తెలంగాణ జాతిపిత, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 15వ వర్ధంతిని ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (యు టి ఎఫ్) రాష్ట్ర సీనియర్ నాయకులు బండి అంజిరెడ్డి, మండల సీనియర్ నేత మోరంపూడి చంద్రశేఖరరావు అధ్యక్షతన వేంసూరు మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వేంసూరు మండల అధ్యక్షుడిగా మేడా విజయ్‌బాబు, ఉపాధ్యక్షుడిగా రేగళ్ల రామిరెడ్డి, కార్యదర్శిగా గండ్ర జగన్మోహన్‌రెడ్డి, ఉబ్బల నాగేశ్వరరావు, ఖజాంచీగా మిరియాల రాజు ఎన్నికయ్యారు. సభ్యులుగా కనకపూడి రవి, మేకల వెంకటేశ్వర్లు, భూసమ్మ తదితరులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… జయశంకర్ సార్ చూపిన మార్గంలో తెలంగాణ పునర్నిర్మాణం, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ, ఉద్యమ ఆకాంక్షలు మరియు ఉద్యమ నినాదాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, సమానత్వం–స్వాభిమానంతో కూడిన సమాజ నిర్మాణమే జయశంకర్ సార్‌కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. “జయశంకర్ సార్ ఆశయాలే మా దిక్సూచి – తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి అధ్యక్షుడు వాసం దాసు, కల్లూరు మండల అధ్యక్షుడు దోమతొట్టి పాకీర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!