ePaper
Monday, September 14, 2026
📄 ePaper

పంచాయతీ సిబ్బందితో కలిసి పరిసరాల శుభ్రత పనులు ప్రారంభం : సర్పంచ్ గాయం రమేష్ 

📰 Generate e-Paper Clip

ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు 

దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని లంకసాగర్ క్రాస్‌రోడ్ వద్ద గతంలో మాజీ ఎంపీ రేణుకా చౌదరి హయాంలో ఎంపీ నిధులతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆక్రమణకు గురై దశాబ్దాలుగా నిరుపయోగంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామ సర్పంచ్ గాయం రమేష్, కమ్యూనిటీ హాల్‌ను తిరిగి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశ్యంతో చర్యలు ప్రారంభించారు. గ్రామ సెక్రటరీ టి. నాగేంద్ర బాబుతో కలిసి పంచాయతీ సిబ్బంది సహకారంతో కమ్యూనిటీ హాల్ పరిసరాలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాయం రమేష్ మాట్లాడుతూ… ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. త్వరలోనే హాల్‌కు రంగులు వేయించి, అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

విద్యార్థులు వినాయకుని నుండి ఏకాగ్రత, పట్టుదల నేర్చుకోవాలి -పలుస శంకర్ గౌడ్

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ప్రజా సేవలో 42 వసంతాలు పూర్తి చేసుకున్న రాయప్ప

42 సంవత్సరాల నిస్వార్థ ప్రజా సేవ పూర్తి చేసుకున్న ఎస్సై కొప్పుల...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!