ePaper
Monday, September 14, 2026
📄 ePaper

దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేపై కారు దగ్ధం 

📰 Generate e-Paper Clip

ఫ్రంట్ టైర్ పేలడంతో అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొట్టిన కారు

స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డ ఏడుగురు యువకులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గం రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 26 2026: ఖమ్మం జిల్లా వేంసూరు సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేపై కారు దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఎర్రవరం వైపు ఏడుగురు యువకులు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం, కారు అధిక వేగంతో వెళ్తుండగా ఫ్రంట్ టైర్ ఒక్కసారిగా పేలింది. దీంతో అదుపు తప్పిన కారు రైలింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం కారులో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. అయితే మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని గమనించిన యువకులు అప్రమత్తమై వెంటనే కారు నుంచి బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లింగపాలెం ఎగ్జిట్ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఇటీవల కరీంనగర్‌లో ఎలక్ట్రిక్ బస్సుకు మంటలు అంటుకున్న ఘటన మరవకముందే, గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఈ కారు దగ్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Articles

విద్యార్థులు వినాయకుని నుండి ఏకాగ్రత, పట్టుదల నేర్చుకోవాలి -పలుస శంకర్ గౌడ్

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ప్రజా సేవలో 42 వసంతాలు పూర్తి చేసుకున్న రాయప్ప

42 సంవత్సరాల నిస్వార్థ ప్రజా సేవ పూర్తి చేసుకున్న ఎస్సై కొప్పుల...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!