ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రైతు సింహ...

తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రైతు సింహ గర్జనవిజయ వంతం.

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ జూన్ 30 2026: తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో రైతు సింహ గర్జన ముఖ్య ఉద్దేశం రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకు రెండు లక్షల వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి. రైతు మోటార్ల పై మీటర్లు పెట్టకూడదు. మక్కాను కొనుగోలు చేయాలి. రైతు పండించిన ధాన్యానికి గరిష్ట ధర నిర్ణయించి కొనుగోలు చేయాలి. పసుపు రైతులకు న్యాయం చేయాలి. కౌలుదారులకు కౌలు భద్రతా చట్టాన్ని ఏర్పాటు చేయాలి. రైతు కూలీలకు 12 వేల రూపాయలు ఇవ్వాలి. రైతు బీమా ఐదు లక్షల వరకు వర్తింప చేయాలి రైతుబంధు ప్రతి ఎకరాకు 15000వేల రూపాయలుఇవ్వాలి. రైతులకు గ్రామీణ బ్యాంకుల ద్వారా, సహకార పరపతి సంఘాల ద్వారా వడ్డే లేని రుణాలు ఇవ్వాలి. ప్రభుత్వమే నాణ్యమైన వ్యవసాయ విత్తనాలు ఇవ్వాలి. ప్రభుత్వమే నాణ్యమైన రసాయనిక క్రిమిసంహారక మందులను ఇవ్వాలి. ప్రభుత్వము రైతులకు సరిపడా ప్రతి మండలంలో గిడ్డంగి సౌకర్యాలను కల్పించాలి. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేవరకు గిడ్డంగి సౌకర్యాలలో నిల్వ చేసుకునే ఉచిత సౌకర్యాన్ని కల్పించాలి. రైతులు అప్పుల బారిన పడకుండా ఉండాలంటే గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారస్తులకు తప్పనిసరిగా లైసెన్సింగ్ విధానాన్ని ఏర్పాటు చేయాలి. కౌలు రైతులను ఆదుకోవాలి. పోడుదారులకు పట్టా భూములు ఇవ్వాలి. తడిసిపోయిన రైతు పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ (డి)పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ మంగళవారం జూన్ 30వ తేదీన సింహ గర్జనను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గోగర్ల రాజేశం, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కుమ్మరి లింగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్, మధు, రాష్ట్ర మహిళా కమిటీ సింగం తార, పర్వీన్, సిరి వేరు శారద తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!