ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

10వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు

📰 Generate e-Paper Clip

పే అప్‌గ్రేడేషన్, పీఆర్పీ చెల్లింపుల కోసం కొనసాగుతున్న నిరసన

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని అధికారుల స్పష్టం

పొలిటికల్ పవర్ దినపత్రిక / పియన్9 టివి తెలుగు న్యూస్, సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సమస్యల పరిష్కారం కోసం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 10వ రోజుకు చేరుకున్నాయి. సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ప్రధాన గేటు ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ దీక్షలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9:25 గంటల నుంచే అధికారులు దీక్షా శిబిరంలో కూర్చుని తమ నిరసనను వ్యక్తం చేశారు. తమ సుదీర్ఘకాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ముఖ్యంగా పే అప్‌గ్రేడేషన్, అలాగే ఉద్యోగుల జీవితంలో కీలకమైన పీఆర్పీ (PRP) బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. నేటి దీక్షలో పాల్గొన్న అధికారులు: కె.వి. అనిల్ కుమార్ – ఎస్‌సీ, జేవీఆర్ ఓసీపీ డి. సూర్యప్రకాశ్ – ఎస్‌ఈ, కిష్టారం ఓసీపీ యు. సాయి శ్రవణ్ – డిప్యూటీ ఎస్‌ఈ, జేవీఆర్ ఓసీ సీహెచ్‌పీ ఈ అధికారులు రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

Latest Articles

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పట్టాలి*పొలిటికల్ పవర్ ప్రతినిధి  ఖమ్మంగంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు,...

error: Content is protected !!