ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్*నారాయణ విద్యాసంస్థలో వృక్షారోపణ కార్యక్రమం*

*నారాయణ విద్యాసంస్థలో వృక్షారోపణ కార్యక్రమం*

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూలై 10:

తూర్పుగోదావరిజిల్లా అనపర్తిలోని నారాయణ విద్యాసంస్థలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా వృక్షారోపణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏజీఎం అలీషా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు. మొక్కలు మనకు ప్రాణవాయువును అందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణ విద్యాసంస్థ విద్యార్థులు అనపర్తిలోని దేవి చౌక్ పరిసర ప్రాంతాల్లోని దుకాణదారులకు మొక్కలను అందజేసి, వాటిని నాటి సంరక్షించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నందకుమార్, ఏజీఎం అలీషా, కో-ఆర్డినేటర్ మాధురి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొక్కల సంరక్షణపై ప్రతిజ్ఞ చేసి, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని తెలిపారు.

Previous article
లేయలాండ్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తాటి హైదరాబాద్, జూలై 10: హైదరాబాద్‌లోని గుండ్ల పోచంపల్లి ప్రాంతంలో గణ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ రామకృష్ణ గారు నూతనంగా ఏర్పాటు చేసిన అశోక్ లేయలాండ్ సర్వీస్ సెంటర్‌ను అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు గారు హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు గారు నిర్వాహకులు శ్రీ రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆధునిక సౌకర్యాలతో ప్రారంభమైన ఈ అశోక్ లేయలాండ్ సర్వీస్ సెంటర్ వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించి సంస్థ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. అనంతరం గణ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ రామకృష్ణ గారు తాటి వెంకటేశ్వర్లు గారిని శాలువాతో ఘనంగా సన్మానించి, శ్రీ సీతారామచంద్ర స్వామివారి మెమెంటోను అందజేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులు పాల్గొని నూతన సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!