ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్లేయలాండ్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తాటి హైదరాబాద్, జూలై 10: హైదరాబాద్‌లోని గుండ్ల పోచంపల్లి...

లేయలాండ్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తాటి హైదరాబాద్, జూలై 10: హైదరాబాద్‌లోని గుండ్ల పోచంపల్లి ప్రాంతంలో గణ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ రామకృష్ణ గారు నూతనంగా ఏర్పాటు చేసిన అశోక్ లేయలాండ్ సర్వీస్ సెంటర్‌ను అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు గారు హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు గారు నిర్వాహకులు శ్రీ రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆధునిక సౌకర్యాలతో ప్రారంభమైన ఈ అశోక్ లేయలాండ్ సర్వీస్ సెంటర్ వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించి సంస్థ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. అనంతరం గణ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ రామకృష్ణ గారు తాటి వెంకటేశ్వర్లు గారిని శాలువాతో ఘనంగా సన్మానించి, శ్రీ సీతారామచంద్ర స్వామివారి మెమెంటోను అందజేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులు పాల్గొని నూతన సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!