ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్*డాక్టర్స్ డే సందర్భంగా నారాయణ విద్యాసంస్థలో వినూత్నంగా వేడుకలు*

*డాక్టర్స్ డే సందర్భంగా నారాయణ విద్యాసంస్థలో వినూత్నంగా వేడుకలు*

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూలై 10:

డాక్టర్స్ డే సందర్భంగా అనపర్తిలోని నారాయణ విద్యాసంస్థలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైద్య వృత్తి గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు డాక్టర్ల వేషధారణలో పాల్గొని తమ అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నందకుమార్ మాట్లాడుతూ, మానవాళి ఆరోగ్యాన్ని కాపాడేందుకు అహర్నిశలు శ్రమించే వైద్యులు సమాజానికి అమూల్యమైన సేవలు అందిస్తున్నారని అన్నారు. ప్రాణాలను నిలబెట్టే వైద్యులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో సేవాభావం, మానవత్వం, సమాజం పట్ల బాధ్యత పెంపొందేలా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని వివరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజీఎం అలీషా హాజరై విద్యార్థులను అభినందించారు. అనంతరం కో-ఆర్డినేటర్ మాధురి, ప్రిన్సిపాల్ నందకుమార్, వైస్ ప్రిన్సిపాల్ స్వాతి, ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు, డాక్టర్ల వేషధారణలు అందరి ప్రశంసలు అందుకున్నాయి.

Previous article
Next article
అడ్వకేట్ భవాని కృష్ణ యాదవ్‌పై నమోదు చేసిన అక్రమ కేసులను ఖండించిన “ఐలు” పేద రైతులకు పూర్తి న్యాయ సహాయం అందిస్తామని హామీ దమ్మపేట, జూలై 10: అడ్వకేట్ గోళ్ల భవాని కృష్ణ యాదవ్ గారిపై దమ్మపేట పోలీసులచే నమోదు చేసిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర ప్రతినిధులు ఈరోజు ఖమ్మం, హైదరాబాద్ నుండి దమ్మపేటకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఐలు నాయకులు మాట్లాడుతూ, పేద రైతుల భూ హక్కుల పరిరక్షణ కోసం అడ్వకేట్ భవాని కృష్ణ యాదవ్ చేస్తున్న న్యాయ పోరాటానికి తమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రైతులకు న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తామని, భూ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తామని తెలిపారు. అలాగే, రైతులు భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేపట్టే ప్రజాస్వామ్యబద్ధమైన నిరసన కార్యక్రమాలకు ఐలు పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. అవసరమైతే ఈ అంశాన్ని తెలంగాణ హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లేందుకు కూడా తమ సంఘం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు దొడ్డా లక్ష్మీనారాయణ , మోరంపూడి శ్రీనివాసరావు , కొలికపోగు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఐలు రాష్ట్ర నాయకులు కొల్లి సత్యనారాయణ, ఏడునూతల శ్రీనివాసరావు, జలసూత్రం శివరాం ప్రసాద్, జక్కంపూడి నాగేశ్వరరావు, ఉడతనేని శ్రీనివాసరావు, మారం సతీష్ , దర్గా వాలి, అరుణ తదితరులతో పాటు దమ్మపేట బార్ అసోసియేషన్ సభ్యులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!