ePaper
Monday, September 14, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మందమర్రి మండలం వింతలకు నిలయం .

గ్రామాలలో తీగ లాగితే డొంక కదులుతున్న విపరీత బ్యాంకు బుక్కుల బాగోతం.

ఆన్లైన్ ఆటలకు అభం -శుభం తెలియని వాళ్లు బలవుతున్న వైనం,

ఒక్కరి పేరు మీద ఐదు రకాల బ్యాంకు అకౌంట్లంటా..

మందమర్రి: శనివారం జూలై 11

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని వెంకటాపూర్, గుడిపల్లి ,శంకర్ పల్లి గ్రామాలలో నివసిస్తున్న అభం- శుభం తెలియని గ్రామీణ వాసుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, పెద్దపెల్లి జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి. ఈ గ్రామాలకు చెందిన దాదాపు 150 మందికి ,ఒక్కొక్కరి పేరు మీద వేరు -వేరు బ్యాంకులకు చెందిన 5 బ్యాంకు అకౌంట్ బుక్కులు ఇప్పించారు. ఒక్క అకౌంట్ తీయడానికి 1500 రూపాయల చొప్పున, ఒక్కొక్కరికి ₹7500 రూపాయలు చెల్లించి నూతన బ్యాంకు అకౌంట్లు ఇప్పించారు. 1.సెంట్రల్ బ్యాంకు 2.బ్యాంక్ ఆఫ్ బరోడా 3.యూనియన్ బ్యాంకు

4. ఐడిఎఫ్సి బ్యాంకు

5.గాయత్రి బ్యాంకు కు చెందిన బ్యాంక్ అకౌంట్లు ఇప్పించి. బ్యాంకు అకౌంటు బుక్కులు వారి దగ్గరనే ఉంచుకుని. ఏటీఎం కార్డులు మాత్రం సదరు బ్యాంకు అకౌంటు దారులకు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. ప్రస్తుతం సమస్య ఏంటంటే ?

ఒక్కొక్క బ్యాంకు అకౌంట్లో బ్యాంకు అకౌంట్ దారులకు తెలియకుండానే దాదాపు 25,000 రూపాయలు జమై ఉన్నాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో వారికి లేదు. ఎందుకు వచ్చాయో తెలియదు. కొసరు డబ్బులకు ఆశపడి అసలు పెట్టారా.. లేక ,ఇదేమైనా మోసమా.. మళ్ళీ మీమేమైనా చెల్లించాలా.. అనే ఆలోచనలో పడ్డారు సదరు బ్యాంకు అకౌంటు దారులు. అకౌంట్ ఇప్పించినటువంటి సదరు వ్యక్తులు ఈ అకౌంట్ దారులకు నిత్యం ఫోన్ చేసి. మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు మాకు చెల్లించాలి. మీ బ్యాంకు బుక్కు అకౌంట్లౌను రద్దు చేసుకోవాలంటున్నారు. ఏటీఎం కార్డులు ఇవ్వమంటున్నారు. ఈ డబ్బులు వారికి ఇస్తే మళ్లీ బ్యాంకు కి ఎవరు కట్టాలి అనేది వీరికి అర్థం కావడం లేదు. ఇదిలా ఉండగా.. ఒక్కొక్కరి పేరు మీద 5 బ్యాంకులకు చెందిన అకౌంట్లు ఇప్పించి వీరు ఏం చేశారు. ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనేది ఒక పెద్ద సమస్యగా మారింది నేడు. ఆన్లైన్ బెట్టింగ్ లాడారా.. లేదా ఇంకా ఏదైనా మాయ చేశారా? ప్రస్తుతం బ్యాంకు అకౌంట్లు ఇప్పించిన సదరు వ్యక్తులు దాదాపు మూడు కోట్ల రూపాయలకు పైగా సంపాదించారంటూ లుకలుకలు వెల్లువెత్తుతున్నాయి.

డబ్బులకు ఆశపడి ఏదైనా కుంభకోణంలో చిక్కుకున్నామా..? దీని వెనకాల ఇంకేమైనా మతలాబుందా అంటూ.. ఆవేదన చెందుతున్నారు గ్రామీణ వాసులు .ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక ,మనసులో దాచుకోలేక సతమతమవుతున్నారు. పైన తెలిపిన గ్రామాలలో సమగ్రంగా పరిశీలన చేసి, అసలు ఏం జరిగింది. ఈ తతంగానికి సూత్రధారులు -పాత్రధారులు ఎవరనేది తేట తెల్లం చేయాలంటూ.. పోలీసు వారిని వేడుకుంటున్నారు.

Latest Articles

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్...

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ...

కచ్చేరి దేవరాయపల్లి – వెంగం నాయుడుపల్లి గ్రామాల మధ్య శ్రీ బరిగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శుభారంభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ములకలపల్లి మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

*ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మహిళా మండలీ అధ్యక్షురాలు గుర్రం...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!